top of page
Writer's pictureAPTEACHERS

ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కుల తొలగింపు - G.O.Ms.No 101dt.25.09.2020 విడుదల.(AP)

Updated: Aug 23, 2021

ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కుల తొలగింపు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు.


డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగటివ్ మార్కులు తొలగిస్తూ, పాత పద్ధతిలోనే ఉన్న పాస్ పాస్ మార్కులనే వర్తింపచేస్తూ ఉత్తర్వులు G.O.Ms. No 101 dt. 25.09.2020 విడుదల.


ఇకపై ఇవ్వబోయే నోటిఫికేషన్ ద్వారా జరిగే పరీక్షలకు 40 మార్కులకు పాస్ . నెగెటివ్ మార్కులు లేవు.


మే2020 కొరకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషనుకి ( ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి) ఈ మార్పు వర్తించదు.


ఇకపై జరిగే వాటికి వర్తిస్తుంది. కనుక అభ్యర్ధులు గమనించగలరు.


కనీస పాస్ మార్కు 40శాతంగా పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు డిపార్టమెంట్ టెస్ట్సు 1965 నిబంధలను సవరిస్తూ సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించు ఈ పరీక్షలకు ఇక ముందు నుంచి కనీస పాస్ మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు ప్రకటిస్తుంది.ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. పాస్ మార్కులు గతంలో ఎలా ఉండేదో అలా 40శాతానికి మార్పు చేశారు.

జీవో 55 ద్వారా 2017లో నెగిటివ్ మార్కులు

2017లో జీవో 55 ద్వారా డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ఆ ఏడాది నవంబరు నుంచి వచ్చిన విధానం ప్రకారం ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కు తగ్గించేలా మార్పులు చేశారు. జవాబు రాయని ప్రశ్నలను పరిగణనలోకి తీసుకునే వారు కాదు. అన్ని ఆబ్జెక్టివ్ పరీక్షల్లో కనీస మార్కలను 35శాతంగా తగ్గించారు.

ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, టీచర్ల యూనియన్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పబ్లిక్ సర్వీసు కమిషన్ కు దీనిపై ఎన్నో వినతులు సమర్పించారు. ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు డిపార్టమెంటు పరీక్షలకు సంబంధం ఉన్న నేపథ్యంలో నెగిటివ్ మార్కులు ఉద్యోగులు, టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నాయని వచ్చిన వినతుల మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాసి నెగిటివ్ మార్కులు జత చేస్తూ 1965 డిపార్టుమెంట్ పరీక్షలకు చేసిన 17వ సవరణనను తొలగించాలని కోరారు.

ఈ నెగిటివ్ మార్కుల వల్ల ఉద్యోగుల ఉత్తీర్ణతశాతం బాగా తగ్గిపోయిందని విశ్లేషణల్లో తేలిందని కూడా కమిషనర్ పేర్కొన్నారు. పాస్ మార్కులు 35శాతానికి తగ్గించినా సరే, నెగిటివ్ మార్కుల వల్ల పాస్ అయ్యే వారి సంఖ్య బాగా తగ్గినట్లు గుర్తించారు. ఇలాంటి నెగిటివ్ మార్కుల విధానం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో సైతం లేదని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నెగిటివ్ మార్కులు తొలగించింది. కనీస పాస్ మార్కును గతంలో లా 40శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో 101 శుక్రవారం విడుదలయింది.


Click here to download proceedings ⬇️


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page