top of page
Writer's pictureAPTEACHERS

ఉద్యోగులకు 204 రకాల ప్రొసీజర్స్లో మెడికల్ రీయింబర్స్ మెంట్.

ఉద్యోగులకు 204 రకాల ప్రొసీజర్స్లో మెడికల్ రీయింబర్స్ మెంట్


ఈహెచ్ఎస్కు అర్హత ఉన్న ఉద్యోగులకు 204 ప్రొసీజర్స్ (వ్యాధి రకాలు)లో మెడికల్ రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు కన్సల్టేషన్, మెడికేషన్, డయాగ్నోస్టిక్స్, రెఫరల్ సేవల కోసం ఆయా ఏరియా ఆస్పత్రుల్లో క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 14న ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రతినిధుల కోరిక మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఉత్తర్వుల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు.


🙋‍♂Medical Reimbursement  EHS G.O 353 Info:


👉 చాలా రోజుల తర్వాత Medical Reimbursement &EHS కు సంబంధించిన  మంచి G.O 353 విడుదలయినది


🙋EHS నుండి Medical Reimbursement కు "యూ" టర్న్


👉 కేన్సర్, గుండె,అవయవ మార్పిడి,Plastic Surgery ,మూత్రపిండ.చికిత్స కు సంబంధించిన25 రకాల చికిత్సలకు EHS లో వలెనే మెడికల్ రీ ఇంబర్సమెంట్ లో కూడా రు2 లక్షలకు  పై బడి తిరిగి చెల్లించబడును


👉AP state లోని ప్రస్తుత 14 సెంటర్లకు అదనంగా 26 జిల్లా కేంద్రాలలో జిల్లా/టీచింగ్ హాస్పిటల్ లలో కూడా Chronic Diseases కు Out patient చికిత్సను అందిస్తారు


👉EHS క్రింద Area Hospitals లో consultation,Diagnosis,Medicines ,పెద్ద hospitals కుRefer చేయుట జరుగును


👉డెంటల్ చికిత్సకు Package రేట్లు పెంచబడినవి


👉2018  ఆగష్టులో G.O 345 ద్వారా Medical Reimbursement క్రింద  తొలగించబడిన 204  చికిత్సలు( మోకాళ్ళు,కళ్ళు, పళ్ళు, Orthopedic,గుండె మొ!!నవి)  EHS తో పాటు (EHS ప్యాకేజి రేట్లతో మాత్రమే) Medical Reimbursement  పధకం క్రింద  కూడా చికిత్స కొనసాగించబడును


👉 ఈ G.O వలన EHS పై నమ్మకం లేక Private Hospitals లో  ఖర్చు తో కూడిన వైద్యం పొందుతున్న వారికి మెడికల్ రీ ఇంబర్సమెంట్ ను ప్రత్యామ్నయం గా ఉండటం   కొంత హర్షణీయం .


👉 త్వరలో  నెలవారీ EHS  Subscription పెంచు తారుట


15 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page