ఉపాధ్యాయ బదిలీలు2020 ప్రమోట్ చేసిన ఉపాధ్యాయుల జాబితా,తుదిసీనియారిటీజాబితా&జిల్లా వైజ్ ఖాళీల జాబితాలు
- APTEACHERS
- Dec 10, 2020
- 1 min read
Updated: Aug 23, 2021
AP Teacher Transfers 2020 Promoted Teachers List, Final Seniority List and District Wise Vacancy lists
AP ఉపాధ్యాయ బదిలీలు 2020 ప్రమోట్ చేసిన ఉపాధ్యాయుల జాబితా, తుది సీనియారిటీ జాబితా మరియు జిల్లా వైజ్ ఖాళీల జాబితాలు
నేటి నుంచి ఆప్షన్లు
★ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది అంకానికి చేరింది.
★ బదిలీ కోసం దరఖాస్తు చేసిన తుది సీనియారిటీ జాబితాను గురువారం విడుదల చేశారు.
★ ఈ జాబితాకు పాఠశాల విద్య డైరెక్టర్ ఆమోదముద్ర వేయడంతో వెబ్‌సైట్‌లో ఉంచి డౌన్‌లోడ్ చేసేకునేందుకు అవకాశం కల్పించారు.
★ ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పాఠశాలలు ఎంపిక చేసుకొని ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది.
★ ఈ విషయంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా సెండరీగ్రేడ్ టీచర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
★ తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు తాము కోరుకునే పాఠశాలలను ముందుగానే ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి.
★ 2015 సంవత్సరంలో జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు పెట్టుకుని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవ హరించిన టీచర్లకు చుక్కలు కనిపించాయి.
★ అందువల్ల ఉపాధ్యాయులు పాఠశాలల ఎంపిక ఆప్షన్ల నమోదులో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.