top of page

గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ

గూగుల్ రీడ్ ఎలాంగ్ యాప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ► సెలవుల్లో కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పఠనా సామర్థ్యం, నేర్చుకునేతత్వం పెంచేలా ఏపీ విద్యాశాఖ విద్యార్థులకు సరికొత్త యాప్ను పరిచయం చేస్తోంది. ► ఇప్పటికే పాఠశాలల్లో అమలవుతున్న ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని సెలవుల్లోనూ కొనసాగించేలా సమగ్ర శిక్ష అధికారులు చర్యలు తీసుకున్నారు. ► దీనిలో భాగంగా గూగుల్ సంస్థతో ఏపీ సమగ్ర శిక్ష అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశపెట్టిన ' గూగుల్ రీడ్ ఎలాంగ్ ' యాప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ► ఇప్పటికే యాప్ వినియోగం పై ఉపాధ్యాయులకు ఒక రోజు ఆన్లైన్ శిక్షణ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈనెల 20 నుంచి ఉపాధ్యాయులు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తెలుగు , ఇంగ్లిష్ పై పట్టు .. ► వినోదాత్మక ప్రసంగ ఆధారిత యాప్ అయిన ' గూగుల్ రీడ్ ఎలాంగ్ ' ద్వారా ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించవచ్చు. ► స్థాయికి తగ్గ పదాలు, కథలు, ఆటలు ఈ యాప్లో రూపొందించారు. ఆయా భాషల్లో పఠనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఇది సహాయపడుతుంది. ► ఆసక్తి కలిగిన కథనాలను చదవమని దియా పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మతో కలిసి స్టార్ రేటింగ్, బ్యాడ్జ్ లను సేకరించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ► యాప్ స్వరాన్ని గుర్తించే సదుపాయం ఉంది. పదాలు, కథలు చదివినప్పుడు దియా వింటుంది. తప్పు చదివితే గుర్తించి సరిచేస్తుంది. నెట్ అవసరం లేదు ► యాప్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు. నెట్ అవ lసరం లేకుండా ఆఫ్లైన్లోనూ పనిచేస్తుంది. పిల్లల కోసం రూపొందించారు కాబట్టి ఎటువంటి ప్రకటనలు ఉండవు. ► పుస్త కాలు, పిల్లల కథలు, చోటా భీమ్ నుంచి వివిధ పఠన స్థాయిలో వెయ్యికి పైగా పుస్త కాలతో లైబ్రరీ ఉంది. విద్య మిళితమైన ఆటలు అభ్యసన అనుభవాన్ని వినోదభరితంగా మార్చుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత ప్రొఫైల్ రూపొందించుకోవడం ద్వారా వారి సొంత పురోగతిని ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ► Read along app download link

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page