టీచర్ల బదిలీలకు సదరమ్ సర్టిఫికెట్ ప్రామాణికం
ఉపాధ్యాయుల బదిలీల్లో సంబంధిత టీచర్లు ప్రాధాన్యత పొందేందుకు సదరమ్ సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసు కోవాలని పాఠశాల విద్య కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్ట ర్లు మాన్యువల్ గా ఇచ్చే వైద్య ధ్రువీకరణ పత్రాలు బదులుగా సదరమ్ సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని ఆర్డేడీలు, డీఈవోలను ఆదేశించారు. గతంలో మాన్యువల్ గా ఇచ్చిన సర్టిఫికెట్లతో కొందరు అక్రమంగా లబ్ధి పొందారని ఫిర్యాదులు రావడంతో సదరమ్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేశారు.
మన విద్యాశాఖలో విద్యార్థులు (స్కాలర్ షిప్/రిజర్వేషన్ కోసం), ఉపాధ్యాయులు(రిజర్వేషన్/రోస్టర్ పాయింట్స్ కోసం) తదితరులు పలు సందర్భాలలో దివ్యాంగ సర్టిఫికెట్స్ వాడతారు.
ఈ సర్టిఫికెట్స్ లో నమోదు చేయబడిన వైకల్యాన్ని (అంటే.. మాన్యువల్ PHC సర్టిఫికెట్స్ లో నమోదు కాబడిన వైకల్య శాతానికి సదరెం సర్టిఫికెట్స్ లో నమోదు కాబడిన వైకల్య శాతానికి వ్యత్యాసం ఉంటున్నది) GO MS No.31, తేది.01.12.2009 లో పేర్కొనబడిన మార్గదర్శకాలను అనుసరిస్తూ... సదరెం ద్వారా మాత్రమే వైకల్యాన్ని అంచనా వేయవలసిందిగా అందరు RJD లను, DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.
ఈ మెమో సారాంశం ఏమిటంటే.... ఒక విద్యార్థి గానీ, ఉపాధ్యాయుడు గానీ, అధికారి గానీ ఒక డిజెబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినపుడు, దానియొక్క genuineness ని విచారించటానికి గానీ / అందులో నమోదు చేయబడిన వైకల్య శాతాన్ని అంచనా వేయటానికి గానీ సదరెం ద్వారా మాత్రమే చేయాలని.. ఇది పైన పేర్కొనబడిన సందర్భాలకు పరిమితం కాగలదని ఈ మెమో సారాంశం.