ట్రాన్స్ఫర్ 2022 సందేహాలు - సమాధానం.
1. Preferential category/special points లో spouse ఇరువురిలో 5/8 సంవత్సరాలలో ఒకరు మాత్రమే వినియోగించు కోవాలా?
సమాధానం : అవును . 2020 ట్రాన్స్ఫర్ లో spouse పాయింట్స్ పొంది బదిలీ అయిన వారు , spouse చనిపోతే, అట్టి వారు 5/8 సంవత్సరాలు పూర్తి కాకపోయినా widow preferential category వాడుకొనవచ్చు. ( GO 190 )
2. గత 5/8 సంవత్సరాల లోపు బదిలీల్లో భార్య/ భర్త SPOUSE పాయింట్స్ పొంది బదిలీ అయిన చో, ప్రస్తుత బదిలీల్లో RE APPORTIONMENT(MAPPING) లో పోస్ట్ సర్ప్లస్ అయితే భర్త/భార్య SPOUSE పాయింట్స్ వినియోగించు కొనవచ్చా?
సమాధానం : లేదు. 5/8 సంవత్సరాలలో ఒకరు మాత్రమే వినియోగించు కోవాలి. ( GO 187 , 190)
3. గత 5/ 8 సంవత్సరాలలో SPOUSE పాయింట్స్ వాడుకొని ప్రయోజనం పొందిన వారు, 5/8 సంవత్సరాలు పూర్తి కాకపోయినా ప్రస్తుత బదిలీల్లో PREFERENTIAL CATEGORY వినియోగించ వచ్చా?
సమాధానం : లేదు.
4. 2020- 21 లో SPOUSE/ PREFERENTIAL వాడుకొని బదిలీ అయిన వారు, ఇప్పుడు సర్ప్లస్ లో ఉంటే వారు ఇప్పుడు SPOUSE/ PREFERENTIAL వినియోగించ వచ్చా?
సమాధానం: లేదు. వారికి GO 190 ప్రకారం స్టేషన్ పాయింట్స్ తో పాటు Reapportionment points కేటాయించ బడతాయి.
5. పై సందర్భంలో 2020 -21 వారికి పాత స్టేషన్ పాయింట్స్ తో పాటు, ప్రస్తుత స్టేషన్ పాయింట్స్ కూడా ఇస్తారా?
సమాధానం: GO 187, 190 లలో వారికి పాత స్టేషన్ పాయింట్స్ కేటాయిస్తారు ఆని ఉంది. ప్రస్తుత స్టేషన్ పాయింట్స్ గురించి వివరణ రావలసి ఉంది.
6. 2015, 2017 బదిలీల్లో వచ్చి ఇప్పుడు Re apportionment వలన సర్ప్లస్ లో ఉన్న వారికి కూడా పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారా?
సమాధానం : GO 187మరియు 190 లలో 2020-21 వారికి ఆని ఉంది.
7. ఒక స్కూల్ లో Re apportionment వలన ఒక పోస్ట్ సర్ప్లస్ లో ఉంటే , జూనియర్ కాకుండా సీనియర్ ట్రాన్స్ఫర్ లో విల్లింగ్ ఇస్తే , అతనికి కూడా జూనియర్ కి ఇచ్చే అన్ని పాయింట్స్ ఇస్తారా?
సమాధానం : Go 187 లో జూనియర్ కి మాత్రమే పాయింట్స్ ఇస్తారు ఆని ఉంది. GO 190 లో దానిపై ఎలాంటి వివరణ లేదు.
8. తప్పు సమాచారం సమర్పించిన ఉద్యోగి తో పాటు, దానికి ధృవీకరిచిన అధికారిపై కూడా చర్యలు ఉంటాయా?
సమాధానం : GO 187 లోని పాయింట్ 19 ప్రకారం అట్టి ఉద్యోగి మరియు అధికారిపై కూడా AP CCA రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి.