'నో వర్క్- నో పే' క్లాజ్ తొలగింపు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బందికి సంబంధించి ప్రవర్తనా నియమావళిలో గతంలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 14న విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యాశాఖ సిబ్బంది ఎవరైనా స్ప్రెక్ట్స్, బంద్స్, పెన్ డౌన్, చాక్ డౌన్ తదితర ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. అలాగే పాల్గొన్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఆందోళనలు నిర్వహించిన రోజులను 'నో వర్క్ - నోపే'గా, ఆ కాలాన్ని 'నాట్ డ్యూటీ'గా పేర్కొన్నారు. ఈ నిబంధనపై పలు విజ్ఞప్తులు అందడంతో.. దానిని తొల గిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు తాజా ఉత్తర్వులు విడుదల చేశారు. సవరణ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.