top of page
Writer's pictureAPTEACHERS

పిఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఎలా ?

PF విత్ డ్రా చేసుకోవడం ఎలా ?

పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడం సులువే. ఆన్లైన్లో కేవలం 5 నుంచి 10 రోజుల్లోనే పిఎఫ్ క్లయిమ్ డబ్బుల్ని బ్యాంకు ఖాతాకు పొందవచ్చు. అయితే ఇలా చేయాలంటే aadhar, UAN రెండు అనుసంధానమై ఉండాలి

మీ పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే క్రింది షరతులను పాటించాలి.

1. పిఎఫ్ మొత్తాన్ని ఆన్లైన్లోనే సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు.

2. UAN తో త ఆధార్ నెంబరు లింక్ అయి ఉండాలి.

3. ఇవి రెండూ అను సంధానమై ఉంటే 5-10 రోజుల్లోనే పిఎఫ్ డబ్బుల్ని అకౌంట్లోకి పొందవచ్చు.

పిఎఫ్ డబ్బుల్ని ఒకేసారి మొత్తంగా విత్ డ్రా చేసుకోవడం కుదరదు. దీనికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగ సర్వీసు, అవసరం ప్రాతిపాదికన విత్డ్రా చేసుకునే మొత్తం ఆధారపడి ఉంటుంది. అనారోగ్యం ,పెళ్లి ఖర్చులు, పిల్లల చదువు ,ఇంటి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, రుణ చెల్లింపులు వంటి సందర్భాలలో ఈపిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకో గళం.

పిఎఫ్ డబ్బుల్ని ఆన్లైన్లో లో ఎలా విత్డ్రా చేసుకోవాలో చూద్దాం..

*⃣ ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు వెళ్లాలి

తర్వాత UAN, పాస్వర్డ్, క్యాప్ చ కోడ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దీనికి కుడివైపు మెంబర్ ప్రొఫైల్ కనిపిస్తుంది.

*⃣మేనేజ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.KYC ఆప్షన్ ఎంపిక చేసుకోండి. తర్వాతి పేజీలో ఆన్లైన్ సర్వీస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్లయిమ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మెంబర్ వివరాలు చూడొచ్చు. బ్యాంకు ఎకౌంటు చివరి 4 అంకెలు ఎంటర్ చేయండి.

*⃣తర్వాతి పేజీలో ఐ వాంట్ apply ఫర్ వరుసలోని ఫామ్ 31 ఎంపిక చేసుకోండి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లయిమ్ పై క్లిక్ చేయండి.

*⃣ఈపీఎఫ్ మీ కేవైసీ వివరాలను స్వీకరిస్తుంది. పిఎఫ్ క్లయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్రూవల్ లభించిన 5 నుంచి పది రోజుల లోపు మీ బ్యాంక్ అకౌంట్ లో పి.ఎఫ్ డబ్బులు జమవుతాయి

Click here Pf official website👇

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page