ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు పాఠశాల గ్రాంట్లు విడుదల ఉత్తర్వులు మరియు మార్గదర్శకాల
- APTEACHERS
- Sep 16, 2020
- 1 min read
Updated: Aug 23, 2021

School Grants Released Proceedings and Grants Utilization Guidelines
ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు పాఠశాల గ్రాంట్లు విడుదల ఉత్తర్వులు మరియు వినియోగ మార్గదర్శకాలు
విద్యార్థుల ‘లెక్క’ ఆధారంగా పాఠశాలలకు నిధులు కేటాయించారు. గతంలో పాఠశాలలను బట్టి నిధులు విడుదల చేయగా.. తాజాగా విద్యార్థులను కొలమానంగా తీసుకున్నారు. ఒకప్పుడు పెద్ద, చిన్న పాఠశాలలకు ఒకేలా నిధులు విడుదల కావడంతో ఇబ్బందులు తలెత్తేవి. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నిధులు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ అవసరాలు, నిర్వహణ, విద్యుత్తు బిల్లులు, చాక్‌పీసులు, టీఎల్‌ఎమ్, స్టేషనరీ ఇతరత్రాలకు వాడుకోవచ్ఛు స్వచ్ఛత కార్యక్రమాలకు 10 శాతం వెచ్చించేలా ఉత్తర్వులు ఇచ్చారు.
నిధుల విడుదల ఇలా..
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు
1-15 మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.12,500 చొప్పున, 15-100లోపు ఉన్న పాఠశాలకు రూ.25,000, 100-250 మధ్యన ఉంటే రూ.50,000, 250-1000 మధ్యన ఉన్న పాఠశాలకు రూ.75,000, 1000 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలకు రూ.లక్ష చొప్పున అందజేయనున్నారు.
ఉన్నత పాఠశాలలకు..
15 మంది విద్యార్థుల్లోపు ఉంటే రూ.25 వేలు, 15 నుంచి 100 మంది ఉన్న పాఠశాలకు రూ.25 వేలు, 100 నుంచి 250 లోపు ఉన్న పాఠశాలకు రూ.50 వేలు చొప్పున, 250 నుంచి వెయ్యి లోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.75 వేలు చొప్పున, వెయ్యిపైన ఉంటే రూ.లక్ష చొప్పున కేటాయించారు.
Click here to download proceedings ⬇️
Click here to download Schools wise sanction list ⬇️