top of page

పదవి విరమణ చేసిన ఉద్యోగులు

*2024 జనవరి తదుపరి పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ఎలా పొందాలి తెలుసుకుందాం.*


*2024 జనవరి నుంచి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పదవి విరమణ చేశారు, పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకూ విశ్రాంత ఉద్యోగులు హెల్త్ కార్డులు పై వైద్యసేవలు పొందవచ్చు. ఆరు నెలల తరువాత ఆ కార్డులు పని చేయవు.*


*హెల్త్ కార్డులు పొందడానికి ఏం చేయాలి.*


*పదవీ విరమణ తదుపరి ఆరు నెలల తర్వాత కానీ లేదా ఆరు నెలలు ముందుగ హెల్త్ కార్డు పొందాలనుకుంటే, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ వారికి ap ehs @drntrvaidyaseva.ap.gov.in mail ద్వారా ఉద్యోగిగా ఉన్న హెల్త్ కార్డును*

*డి ఆక్టివేట్ చేయమని కోరాలి.* దరఖాస్తు తో పాటు పిపిఓ, ఆధార్ కార్డ్ మరియు పేస్లిప్ ను కూడా స్కాన్ చేసి మెయిల్ పెట్టాలి.*


*తదుపరి ఎన్టీఆర్ ట్రస్ట్ వారు రెండు నుంచి నాలుగు రోజుల్లో ఉద్యోగిగా డి ఆక్టివేట్ చేసి పాస్వర్డ్ పంపిస్తారు, ఈ పాస్వర్డ్ తో మరియు సిఎఫ్ఎం ఎస్ ఐ డి తో ఈహెచ్ఎస్ లో లాగిన్ అవి కొత్త పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి.*


*మనం ఏంచేయాలి?*

*ఎలా దరఖాస్తు చేయాలి.?*


*2024 తరువాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు కొంతమందికి అవగాహన ఉంటుంది ,వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి.*


*_2024నుండి పదవీ విరమణ చేస్తున్న వారికి CFMS నెంబరే యుజర్ ఐ డి గా ఉంటుంది._*


*ముందుగా*

*1.AG ఆఫీసు నుండి వచ్చిన మన PPO స్కాన్ చేసి సేవ్ చేయాలి._ (స్కేన్ కాపీ సైజ్ 200 kb కి మించరాదు)*


2. *పాస్పోర్ట్ సైజ్ ఫొటో స్కాన్ చేసి సేవ్ చేయాలి.*


*3.ఆధార్ కార్డు స్కాన్ చేసి సేవ్ చేయాలి.డిపెండెంట్స్ (Spouse ,Children, Parents) ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ పొటోలు స్కాన్ చేసి సేవ్ చేయాలి*


*4.దరఖాస్తుదారు, డిపెండెంట్సు యెక్క బ్లడ్ గ్రూప్ నోట్ చేసుకొని ఉంచుకోవాలి.*


మనం *http://www.ehs.ap.gov.in*

*సైట్ ఓపన్ చేసి User name దగ్గర CFMS ID నెంబరు ముందు "P" పెట్టి ఎంటర్ చేయండి. (ఉదాహరణకు మన CFMS ID 14070258 అయితే మన user id - P14070258) Password దగ్గర మీ Cfms ఐడి ఎంటర్ చేసి Login type వద్ద pensioner సెలక్ట్ చేసి, అక్కడ ఇవ్వ బడిన కేప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి.*


*ఓపన్ అయిన విండో లో ఎడమవైపున Registrations పై క్లిక్ చేస్తే వచ్చే options లో Initiate Health Card/ View Application పై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో Aadhar number select చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Retrieve Details పై క్లిక్ చేయగానే*


*Application for Pensioner కార్డు అనే దరఖాస్తు వస్తుంది.*

*Login name , Aadhar number display అవతాయి.*


*ఆ అప్లికేషన్ లోని వివరాలన్నీ పూర్తి చేయండి * మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూరించాలి.*


*Personal details లో*

*Retirement type , Name , Date of Birth, Gender , Blood Group , marital status, Date of retirement, Community, Disabled వివరాలు పూర్తి చేయాలి.*


*Address details పూర్తి చేయాలి.*


*Identification మర్క్స్ పూర్తి చేయాలి.*


*Last Posting details* *అక్కడ ఉన్న సెలక్ట్ ఆప్షన్ ద్వారా సరయిన వివరాలు ఎంపిక చేయాలి.*


*తరువాత Pension office details select ఆప్షన్ ద్వారా కరెక్ట్ గా ఎంపిక చేసుకొని క్రింద నివ్వబడిన Save Option పై click చేసి సేవ్ చేయండి.*


*సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత ఇప్పటివరకూ పూర్తిచేసిన వివరాలన్నీ సేవ్ అయి క్రింద*

*Family members detail option వస్తుంది* . అక్కడ *Add beneficiary button* *పై క్లిక్ చేస్తే మరొక విండో ఓపన్ అవుతుంది.*

*అక్కడ Spouse Date of Birth ఎంటర్ చేసి Submit button పై క్లిక్ చేయండి.*


*అక్కడ Display అయిన విండోలో Spouse Aadhar number enter చేస్తే dependent వివరాలు వస్తాయి.*


*అవి పూర్తి చేసి అక్కడే వారి ఆధార్ కార్డు, పొటో కూడా స్కేన్ కాపీ brouse చేసి అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.*


*ఈ విధంగా ఎంతమంది డిపెండెంట్సు ఉంటే అంతమంది వివరాలను యాడ్ చేసి సేవ్ చేయాలి.*


*మెయిన్ అప్లికేషన్ పేజీలో కూడా ఎప్పటికపుడు పూరించిన అంశాలను సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేయండి.*


*అనంతరం క్రింద ఇవ్వబడ్డ *Add Attachments button* *క్లిక్ చేస్తే ఓ విండో ఓపన్ అవుతుంది*

*అందులో*

*Signed Application Form, Aadhar , Date of Birth ,Photo, PPO/Service register detals స్కేన్ కాపీలు ఒక్కోక్కటిగా Signed Application Form తప్ప మిగిలినవి upload చేయాలి. Upload చేసే స్కేన్ ఒక్కొక్క కాపీ సైజ్ 200 kb కి మించరాదు*.


*Signed Application Form తప్ప మిగిలినవి అప్ లోడ్ చేసి సేవ్ చేసిన అనంతరం మెయిన్ పేజీలో Print Application button పై క్లిక్ చేస్తే మనం పూర్తిచేసిన Pensioner Health Card application మన పొటోతో Display అవుతుంది.*


*ఆ అప్లికేషన్ ప్రింట్ తీసి Station , Date fill చేసి Signature చేసి Scan చేసి Add Attachments button క్లీక్ చేసి Signed Application Form దగ్గర అప్లోడ్ చేయాలి*.*


*Upload అయిన తరువాత Submitt Application పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన దరఖాస్తు మన STO/DDO కు పంపబడిందని మన అప్లికేషన్ Dr ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు వారి అప్రవల్ అనంతరం*

*EHS కార్డుమంజూరవుతుందని వస్తుంది. సబ్ ట్రెజరీ అధికారులు హెల్త్ కార్డ్ అప్రూవల్ చేసిన చేయకపోయినా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.*


*హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ కష్టంగానే ఉంటుంది, తక్కువ మంది మాత్రమే చేసుకోగలరు , అలాగే చాలా తక్కువ నెట్ సెంటర్లో ఈ ప్రాసెస్ చేస్తున్నారు. నెట్ సెంటర్లో లేదా తెలిసిన వారి ద్వారా హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి.*

 
 

Recent Posts

See All
ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు (2024-25).

ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు (2024-25) ఒకటి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలన్నీ...

 
 
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page