బేస్ లైన్ అసెస్‌మెంట్ జిల్లాలోని 9 వ తరగతి విద్యార్థుల కోసం చదవడం మాకు చాలా ఇష్టం
ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు
బాలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.
కోవిడ్-19 నేపధ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.
తేది:04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.
•ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది.
ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.
మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.
•ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.
ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి.
మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి
ఉపయోగించాలి.
•ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.
•ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి.
విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు.
ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు
చదివించనవసరంలేదు.
• 🎯కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.
• ☀️వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.
• 🎯అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3,
కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.
☀️9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి.
🎯ఉదాహరణకు ఒక పాఠశాలలో
60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్
నిర్వహించాలి.
☀️ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.
కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.
• ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.
• పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కి
అందచేయాలి.
CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.
List of attachments download ⬇️