top of page
Writer's pictureAPTEACHERS

బదిలీల అక్రమాలకు తాళం!

Updated: Aug 23, 2021


⭕బదిలీల అక్రమాలకు తాళం!


𒊹︎︎︎ కేటగిరీల లెక్క తేల్చారు


𒊹︎︎︎ ఆన్‌లైన్లో వివరాలు


✰ ఇన్నాళ్లు కొందరు అడ్డదారిలో బదిలీ చేయించుకుని, తమకు అనుకూలమైన ప్రదేశంలో చేరిపోతున్నారు.


✰ ముఖ్యంగా రెండు కేటగిరీలను అడ్డుపెట్టుకుని బదిలీ చేయించుకుంటున్నారు.


✰ ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయడానికి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.


✰ స్పౌజ్, స్పెషల్‌ కేటగిరీ వాడుకున్న, వాడుకోని ఉపాధ్యాయుల వివరాలన్నీ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారు.


✰ బదిలీల సమయంలో ఈ రెండు కేటగిరీల్లోని వారు ఆప్షన్‌ ఇవ్వగానే వివరాలన్నీ తెరపై కనిపిస్తాయి.


✰ ఎవరైనా అక్రమాలకు పాల్పడినా ఇట్టే పట్టేస్తుంది.


✰ హేతుబద్ధీకరణ పూర్తి చేసిన అధికార యంత్రాంగం స్పెషల్‌ కేటగిరీ, స్పౌజ్‌ (భార్యాభర్తలు) వాడుకున్న ఉపాధ్యాయుల వివరాలు లెక్క తీశారు.


✰ ఈ రెండు కేటగిరీలను ఉపయోగించుకున్న వారిలో ప్రధానోపాధ్యాయులు 18.11.2015, ఉపాధ్యాయులు 18.11.2012 తర్వాత పరిగణనలోకి తీసుకుని వివరాలు నమోదు చేశారు.


𒊹︎︎︎ అక్రమాలెన్నో..


✰ స్పెషల్‌ కేటగిరీ కింద 2017లో జరిగిన బదిలీల్లో అక్రమంగా దగ్గరి ప్రదేశాలు పొందారు.


✰ ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదానికి గురై కాలు ప్యాక్చరై, మళ్లీ నడిచే వాళ్లు సైతం వినియోగించుకుంటున్నారు.


✰ ఇంకొందరు విడాకులు తీసుకుని మళ్లీ కలిసి కాపురం చేస్తున్నవారు, విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకున్న వారు ఈ కేటగిరీని వాడుకున్నారు.


✰ వినికిడిలోపం, వైకల్యం, దృష్టిలోపం కింద సర్టిఫికెట్లు పొంది బదిలీల సందర్భంగా దగ్గరి ప్రదేశాలు పొందిన వారు ఉన్నారు.


✰ దీంతో అర్హులైన దివ్యాంగులు, ఏళ్ల తరబడి దూరప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు దగ్గరి ప్రదేశాలకు రాలేకపోతున్నారు.


✰ ఇటీవల వినికిడి లోపంతో ఒకరు ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది, దగ్గరి ప్రదేశానికి వచ్చారు.


✰ ఆయనపై ఫిర్యాదు చేయగా సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని వైద్య కళాశాలకు పంపి, పరిశీలిస్తే చెవుడు లేదని తేలింది.


✰ ఆయన్ని సస్పెండ్‌ చేయడంతోపాటు ఉద్యోగోన్నతి తగ్గించారు.


𒊹︎︎︎ రద్దయినా ఎస్‌ఆర్‌లో నమోదు


✰ పలువురు ఉపాధ్యాయులు 2017లో జరిగిన బదిలీల్లో స్పౌజ్‌, స్పెషల్‌ కేటగిరీని ఉపయోగించుకున్నారు.


✰ వారికి ప్రదేశాలు కేటాయించారు.


✰ అయితే ఉన్నపళంగా పండితులకు బదిలీ ఉత్తర్వులు రద్దు చేసి, పోస్టులను ఉన్నతీకరించి ప్రదేశాలు కేటాయించారు.


✰ ఈ క్రమంలో వారంతా స్పెషల్‌ కేటగిరీ ఉపయోగించుకోనట్టే.


✰ అయితే ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)లో మాత్రం నమోదు కావడంతో తాజాగా జరిగే బదిలీల్లో వారి వివరాలపై స్పష్టత రాలేదు.


✰ ఇటీవల ఎంఈఓలు వివరాలు క్రోడీకరించడంతో తమకు అవకాశం కల్పిస్తారా లేదా అని ఆందోళన చెందుతున్నారు.


𒊹︎︎︎ ఆన్‌లైన్‌లో గల్లంతు:


✰ కొందరు ఉపాధ్యాయుల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు.


✰ ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కమిషనర్‌ కార్యాలయానికి నివేదించారు.

12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page