top of page
Writer's pictureAPTEACHERS

బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా ముందుగా నిర్వహించే "డెమో " ను రేపు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ.

Updated: Aug 23, 2021


బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా టీచర్ యూనియన్ ప్రతినిధులకు webex ద్వారా వెబ్ కౌన్సెలింగ్ డెమో రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ అధికారులు.


వెబ్ కౌన్సెలింగ్ పై డెమో

★ ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు ఎలా ఉంటుందో సోమవారం డెమో (నవంబరు 30న) నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.


★ అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానిస్తోంది. వెబ్ ఎక్స్ ద్వారా ఈ డెమో నిర్వహించి కౌన్సెలింగు ఎలా నిర్వహించనున్నారో ఐటీ విభాగం వారు తెలియజేస్తారు.


★ బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగు వద్దని, సెకండరీ గ్రేడ్ టీచర్లు వేల సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


★ ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగుపై డెమో నిర్వహిస్తామని ప్రదర్శన చూసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయ సంఘాలు తెలియజేయవచ్చని డైరక్టర్ గతంలోనే తెలియజేశారు.


★ డెమో తర్వాత వెబ్ కౌన్సెలింగా, మాన్యువల్ కౌన్సెలింగా అన్న నిర్ణయం తీసకుందామని డైరక్టర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


★ ఉపాధ్యాయ సంఘం నాయకులు వెబెక్స్ మీటింగ్ లింక్ మరియు ఐడి ల కొరకు ఐటి విభాగం ను 7659966222, 9866156611 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.




11 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page