top of page
Writer's pictureAPTEACHERS

మన బడి నాడు నేడు-శిథిలావస్థ స్థితిలో ఉన్న పాఠశాల భవనాలను కూల్చివేయడానికినిర్దిష్టమార్గదర్శకాలు GO 61


శిథిల పాఠశాల భవనాల కూల్చివేత అధికారం కలెక్టర్లకు పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, భవనాలను కూల్చివేత అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, గ్రామ, వార్డు వసతుల కల్పన కార్యదర్శి, మండల ఇంజినీరు, మండల విద్యాధికారితో కమిటీని ఏర్పాటు చేయను. న్నారు. దీనికి ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్ గా ఉంటారు. జూనియర్ కళా శాలలకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ భవనాలను పరిశీలించి, కూల్చివేతపై తీర్మానం చేస్తుంది. దీన్ని మండల ఇంజినీర్ ద్వారా పనులు చేపట్టే ఇంజినీరింగ్ విభాగం ఈఈకి పంపిస్తారు. డిప్యూటీ ఈఈతో కలిసి ఆయన భవనాలను పరిశీలించి, మరమ్మతులు చేయడానికి పనికి రాదని నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ధ్రువ పత్రం ఆధారంగా జిల్లా విద్యాధికారి కలెక్టర్కు ప్రతిపాదనలు సమర్పిస్తారు. కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని 'నాడు-నేడు' అంచనాల్లోనే ప్రతిపాదిస్తారు. వారసత్వ కట్టడాల విషయంలో పురావస్తుశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కూల్చివేత ద్వారా వచ్చే సామగ్రిని వేలం ద్వారా విక్రయించి తల్లి దండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.



Dismantling of dilapidated rooms become easy through this GO . Pls note that this has approval from PR &RD dept and finally approved by Honble CM .

- Advisor Infra AP Govt


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page