top of page

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విద్యాశాఖ ఉత్తర్వులు.

Updated: Sep 9, 2023

📵 రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. విద్యార్థులు స్కూల్స్కు మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించగా. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లు ఉపయోగించడంపై ఆంక్షలు విధించారు.టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల.


తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వినియోగం,వినియోగ సమయం మరియు నియంత్రణ కోసం మార్గదర్శకాలు


విద్యా సంస్థలలో మొబైల్ ఫోన్ వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి:

1. ఉపాధ్యాయ బాధ్యతలు:

a.ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడూ మొబైల్‌ ఫోన్లను తరగతి గదులకు తీసుకెళ్లకూడదు.

బి.ఉపాధ్యాయులు బోధనా సమయాల్లో సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం నిషేధించబడింది..📵

సి. ఉపాధ్యాయులు (ప్రధానోపాధ్యాయునితో సహా) ఉదయం వారి వారి హాజరును వేసిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌లను సైలెంట్‌గా మోడ్ లో ఉంచాలి..

ఒక ఉపాధ్యాయుడు బోధన కోసం మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలని భావిస్తే దాని గురించి తాను ముందుగానే తమ లెసన్ ప్లాన్లో మొబైల్ ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నామో రాసి ప్రధానోపాధ్యాయుని దగ్గర ఆ లెసన్ ప్లాన్ లో సంతకం చేయించుకొని ధ్రువీకరించుకున్న తర్వాత మొబైల్ ని ఉపయోగించాలి

ఇది స్పష్టంగా పేర్కొన్న విద్యా లక్ష్యాల ఆధారంగా ఉండాలి.

ఏదైనా అనివార్య కారణాల వల్ల మొబైల్ ఫోన్ తీసుకోవల్సిన సందర్భం వచ్చినప్పుడు

ఉపాధ్యాయుడు పాఠశాల HT or HM నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి మరియు

సరైన కారణాలను నిర్వహించాల్సిన రిజిస్టర్‌లో నమోదు చేయాలి...

కారణం ఖచ్చితంగా వివరంగా ఉండాలి

పరిపాలనా బాధ్యతలు:

మొబైల్ వినియోగం అవసరమయ్యే అడ్మినిస్ట్రేటివ్ పనులు, ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు మార్కింగ్

యాప్, MDM మరియు ఇతర సూచించిన కార్యకలాపాలు బోధన సమయం ప్రారంభానికి ముందే చేయాలి..

(అనగా 9.30కి ముందు

ఉదయం లేదా సాయంత్రం 4 గంటల తర్వాత)

క్రమశిక్షణా చర్యల అమలు:

ఈ ఆదేశాలను పాటించకుంటే అటువంటి చర్యలను తీవ్రంగా పరిగణించబడి తగిన కఠిన చర్యలు తీసుకోబడును...

ఏదైనా ఉపాధ్యాయుడు బోధనా సమయంలో సెల్ ఫోన్ వినియోగ విధానాన్ని ఉల్లంఘిస్తే, ఈ క్రింది దశలలో చర్యలు తీసుకోబడును.


👇🏻👇🏻👇🏻

a.మొదటి నేరం:


HM/Officer ద్వారా ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది

మరియు పాఠశాల రోజు ముగిసే వరకు Office Roomలో ఉంచబడుతుంది.

రోజు చివరిలో ఇంకోసారి ఈ నేరాన్ని పునరావృతం చేయకూడదని వారిని మందలించి వారి ఫోన్ వారికి ఇవ్వడం జరుగుతుంది.


బి.రెండవ నేరం:


HM or Officer ద్వారా ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ లాక్కోబడుతుంది MEO గారికి ఈ విషయాన్ని తెలియపరచి పాఠశాల రోజు ముగిసే వరకు ఆఫీసు రూమ్ లో ఉంచబడుతుంది.

తర్వాత తగు వివరణ ఇచ్చి ఎంఈఓ గారి దగ్గర ఉపాధ్యాయులు తమ ఫోన్ ని తీసుకోవాలి.


సి.మూడవ నేరం:


ఉపాధ్యాయుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని DEO గారి కార్యాలయానికి పంపడం జరుగుతుంది..

తప్పు చేసిన ఉపాధ్యాయులు DEO గారికి తగు వివరణ ఇచ్చి ఆ వివరణని తమ సర్వీస్ పుస్తకంలో నమోదు చేసి తమ మొబైల్ ని తీసుకోవలసి ఉంటుంది.


Commenti


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page