రేషనలైజేషన్,బదిలీలు పర్యవేక్షణ కొరకు అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల
- APTEACHERS
- Oct 17, 2022
- 1 min read
Updated: Oct 18, 2022
స్కూల్ మ్యాపింగ్, రేషనలైజేషన్, కన్వర్షన్, అప్గ్రేడేషన్, పదోన్నతులు, బదిలీలు పర్యవేక్షణ కొరకు అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతు బద్ధీకరణ, సబ్జెక్టు పోస్టుల మార్పు, పాఠశాలల ఉన్నతీకరణ, తరగతుల విలీనం, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియలను పరిశీలించేందుకు జిల్లాకో ఇన్ఛార్జి అధికారిని నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి 13జిల్లాల ప్రాతిపదికన నియమించారు. శ్రీకా కుళం జిల్లాకు విశాఖ ఆర్జేడీ జ్యోతి కుమారి, విజయనగరం జిల్లాకు జేడీ. నాగమణి, విశాఖపట్నం జిల్లాకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు ఆర్జేడీ మధుసూదన్, పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, కృష్ణా జిల్లాకు ప్రజా గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ ప్రసన్నకుమార్, గుంటూరు జిల్లాకు సమన్వయ డైరెక్టర్ పార్వతి, ప్రకాశం జిల్లాకు జేడీ మేరీ చంద్రిక, నెల్లూరు జిల్లాకు గుంటూరు. ఆర్జేడీ సుబ్బారావు, చిత్తూరు జిల్లాకు పాఠ్యపుస్తకాల డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లాకు ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లాకు సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, కర్నూలు జిల్లాకు ఏపీఆర్ఐఎస్ కార్య దర్శి నరసింహారావును నియమించారు.
Appointment of Special Officers for overall monitoring of School Mapping, Reapportionment, Conversion, Upgradation, Promotions and transfers of teaching staff Orders - Issued Rc.No.ESE02-13/90/2021-EST 3-CSE-Part(2) Date: 14/10/2022