top of page

విశాఖపట్నం జిల్లా యందు ప్రాథమిక ,ప్రాథమికోన్నత పాఠశాల ల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ శిక్షణా తరగతులు.

PS,UP ఉపాధ్యాయులకు ELP శిక్షణ తరగతులు సర్వశిక్షాభియాన్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు సమగ్ర అభ్యసనాభివృద్ధి కార్యక్రమంపై శిక్షణా తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.


🔹రానున్న విద్యాసంవత్సరంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న తరుణంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.


🔸ఒక్కో ఉపాధ్యాయునికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు శిక్షణ ఇస్తారు. బోధనలో సమగ్ర నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో బోధనలో మెలకువలు ఉంటాయి.


🔸 ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుంటే ఒకరు ఐదు రోజులు, తర్వాత 5 రోజులు మరొకరు హాజరుకావాల్సి ఉంటుంది. ముగ్గురుంటే ఒకో బ్యాచ్‌లో eఒక్కొక్కరు హాజరుకావాలి. అంతకన్నా ఎక్కువ మంది టీచర్లు ఉంటే సగం మంది చొప్పున శిక్షణ తీసుకుంటారు.


🔹ఈనెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఒక బ్యాచ్‌, 10వ తేదీ నుంచి 14వ వరకు మరో బ్యాచ్‌, 24 నుంచి 28 వరకు మరో బ్యాచ్‌గా ఉపాధ్యాయులు తరగతులకు హాజరవుతారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది ఉంటారు.

🔸ఉపాధ్యాయునికి రోజుకు రూ.100 ఇస్తారు. ఇందులోనే భోజనం కింద రూ.70, అల్పాహారం కింద రూ.30గా విభజించారు.


● శిక్షణ కేంద్రం వద్దే ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటారు.

Time table 👇



విశాఖపట్నం జిల్లాలోని అన్ని మండలాల శిక్షణ ప్రదేశాలు, కోర్స్ డైరెక్టర్ ల వివరాలు రిసోర్స్ పర్సన్ వివరాలు యూనిట్ కాస్ట్ మొదలగు వివరాల కొరకు మరియు కసింకోట మండలం మొదటి ,రెండవ, మూడవ spell లలో ట్రైనింగ్ కు హాజరు కావలసిన ఉపాధ్యాయుల వివరాలు కొరకు⬇️


https://drive.google.com/folderview?id=1eDwqjUIlqTMYPs2OZ_fnhov8-vAXXSAu

Σχόλια


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page