top of page

స్కూల్ డెవలప్మెంట్ కమిటీ నిర్మాణం

Updated: Nov 23, 2022

స్కూల్ డెవలప్మెంట్ కమిటీ నిర్మాణం


పాఠశాల పర్యవేక్షణ ఫండ్ (SMF) కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పాఠశాల విద్యాశాఖ తేది 02-11-2022 విడుదల చేసిన ఉత్తర్వుల సంఖ్య (మెమో నెం. 1840006/MBNN/2022) అనుసరించి తెలియపరుచు సమాచారం.


👉 మన జిల్లా లో 542🏫 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కొత్తగా లాగిన్లు ఇవ్వడం జరిగింది..

👉 ఈ లాగిన్లు SMF నిమిత్తం ఇవ్వడం జరిగింది.

👉 వీటికి డిఫాల్ట్ పాస్వర్డ్

Nadunedu@123


కసింకోట మండలం పాఠశాలల డిఫాల్ట్ పాస్వర్డ్ :Mbnn@123456

 

✅ మేము పంపిన ఎక్సల్ షీటులోని పేర్కొన్న ప్రధానోపాధ్యాయులు అందరూ మీ పాఠశాలకు అనగా మీకు ఇచ్చిన లాగిన్ మరియు Nadunedu@123 పాస్వర్డ్ తో nadunedu.se.ap.gov.in వెబ్సైట్ లో లాగిన్ అవగానే మీ వివరాలు అడుగుతూ ఒక పేజి ఓపెన్ అవుతుంది.

✅ ఆ పేజిలో మీ వివరాలు నింపి మీ పాస్వర్డ్ మార్చుకుని మీ పాఠశాల పిసి సభ్యుల వివరాలు నమోదు చేయవలె.


🔴 గమనిక🔴


➡️ పాఠశాలలకు జరిగిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో ఎన్నుకోబడిన తల్లిదండ్రుల కమిటీ నుంచి.....

➡️ ఇద్దరు సభ్యులను మాత్రమే ఈ SMF ఫండ్ ఖర్చు చేయుటకు మరియు చెక్కులపై సంతకాలు చేయు నిమిత్తం సదరు పిసి సభ్యులు తీర్మానం చేసి ఎన్నుకోవాలి.

➡️ ఈ ఇద్దరు సభ్యులు తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూడవ సభ్యునిగా వుంటారు

➡️ ఈ ముగ్గురు సభ్యులు కలిసి చెక్కులపై సంతకం చేయాలి.

✅ ఈ ముగ్గురు సభ్యులు కలిసి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ గా ఏర్పడి నామకరణము చేయాలి.


➡️ ఈ ఖాతాలకు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ,............... పాఠశాల(28133- - - - -),

ఊరు పేరుతో అకౌంట్ ఓపెన్ చేయాలి.

సదరు ఓపెన్ చేసిన పిసి కమిటీ అకౌంటెంట్ సమాచారాన్ని STMS లో రిజిస్ట్రేషన్ లో

అప్లోడ్ చేయవలె.

ఇది ప్రాథమికంగా చేయవలసిన పని... ఈ ప్రక్రియ ఈ నెల 11వ తేది లోపు ఖచ్చితంగా పూర్తి అయితీరాలి.

ఈ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఏ పనులకు ఏరకంగా అంచనాలు తయారుచేయాలి? ఎవరు చేయాలి అనే సమాచారాన్ని అందజేయగలం.


ఈ SMF పిసి అకౌంట్ ను మీ సమీప బ్యాంకులో తెరుచు నిమిత్తం బ్యాంకు వారికి సమర్పించుటకు సదరు ఉత్తర్వులను కూడా మీకు అందజేయుచున్నాము..

ఇట్లు,

జిల్లా విద్యాశాఖ అధికారి,

అనకాపల్లి జిల్లా.









 


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page