సుకన్య సంవృద్ధి యోజన పథకం(SSY)
చిన్న మొత్తాల పొదుపు కోసం సుకన్య సంవృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. SSY ఖాతాను పోస్ట్ ఆఫీసుల్లో, కమర్షియల్ బ్యాంకుల్లోను తెరవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం సుకన్య సంవృద్ధి యోజన ఖాతాలపై స్టేట్ బ్యాంకు 7.6 శాతం వడ్డి రేట్‌ను అందిస్తుంది. SSY ఖాతాను ఓపెన్ చేయాలంటే కొన్ని రకాల సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారుని బర్త్ సర్టిఫికేట్, లబ్ధిదారుని పేరెంట్స్ లేక సంరక్షకుడి అడ్రస్ ఫ్రూప్, లబ్ధిదారుని పేరెంట్స్ లేక సంరక్షకుడి ఐడీ ఫ్రూప్ సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఎస్‌బీఐలో సుకన్య సంవృద్ధి యోజన ఖాతాను తెరవండి ఇలా:. ఫారమ్‌లో వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్స్‌తోపాటు ఫోటోలను సబ్‌మిట్ చేయండి మినిమం రూ.1000ల నగదును డిపాజిట్ చేయాలి. ఒకసారి అకౌంట్ చేస్తే... నగదు రూపంలో లేక చెక్స్ లేక డిమాండ్ డ్రాప్ట్ రూపంలోను నగదును డిపాజిట్ చేసుకోవచ్చు