top of page


సర్వీస్ బుక్ పొతే


ఉపాధ్యాయ, ఉద్యోగులకు సేవా పుస్తకం (సర్వీబుక్) అత్యంత ముఖ్యమైం ది. అది కాస్తా ఎక్కడైనాపోతే ఏం చేయాలి..? ముందు జాగ్రత్తగా సేవా పుస్తకాన్ని ఉద్యోగులు తమ వద్ద ఉంచుకోవచ్చా? నకలు (డూప్లికేట్) ఎలా సిద్ధం చేసు కోవాలి.. తదితర విషయాలు మీ కోసం.._



• ఉద్యోగ, ఉపాధ్యాయులు నకలు సేవా పుస్తకం తయారు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ. 216ను 1984 ఏప్రిల్ 22న జారీ చేసింది.


• ఒరిజినల్ సేవా పుస్తకంలో సమోదైన వివరాలన్నీ నకలుసేవా పుస్తకంలో స్పష్టంగా రాయాలి.


• ఉద్యోగి పనిచేసే కార్యాలయాధిపతితో నకలు సేవా పుస్తకంలో ఎప్పటికప్పుడు ధృవీకరణ చేయించుకోవాలి. ఈ బాధ్యత ఉద్యోగులదే.


• ఒరిజినల్ సేవా పుస్తకాన్ని ఎప్పుడూ కార్యాలయం లోనే ఉంచాలి.


• కార్యాలయ ఆధిపతి స్వాధీనంలో ఉండగా సేవా పుస్తకం కాలిపోయినా, ఎక్కడైనా పోయినా డూప్లి కేట్ సేవా పుస్తకం సహాయంతో తిరిగి నూతన పుస్తకం తయారుచేస్తారు.


• శాఖాధిపతి అనుమతితో నియమాధికారి గాని లేక అతడి ఆదేశాలతో ఇతర అధీకృత అధికారి గాని కొత్త సేవా పుస్తకాన్ని తయారు చేస్తారు.


• ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు పాఠ శాల విద్యాశాఖ కమిషనర్ అనుమతితో డీఈఓ నూతన సేవా పుస్తకాన్ని పునర్నిర్మిస్తారు. డీఈఓ ఆదేశిస్తే ఎంఈఓ ఉన్నత పాఠశాల హెచ్ఎంలు కూడా తయారు చేయవచ్చు.


• తన నియంత్రణలో పనిచేసే ఉపాద్యాయ, ఉద్యో గులకు కార్యాలయాధిపతి ముందుగా నోటీసు జారీ చేసి, ఏడాదిలో ఒకసారి ఒరిజినల్ సేవా పుస్త కాన్ని వారికి చూపించాలని ప్రభుత్వం 152 జీఓను 1969 మే 20న జారీ చేసింది.


• ఇలా చూపించిన తదుపరి కార్యాలయ అధికారి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరన ధృవీకరణ పత్రాన్ని రూపొందించి పై అధికారికి పంపాలి.


• ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం తమ ఒరిజనల్ సేవా పుస్తకంలో సంతకం చేయడం మరచి పోవద్దు. అందులో పొందు పరచిన అంశా లను, దృవీకరణలను విధిగా తనిఖీ చేసుకోవాలి.


• ఒకవేళ ఉద్యోగి విదేశీ పర్యటనలో ఉంటే. అడిట్ అధికారులు సేవా పుస్తకంలో అవసరమైన నమో దులు చేసిన తరువాతే ఉద్యోగి సంతకం చేయాలి.


• వార్షిక ధృవీకరణలు చేయనట్లయితే సేవాకాలం లోనూ, పదవీ విరమణ పెన్షన్ తదితర విషయా లోనూ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.


• నకలు సేవా పుస్తకాన్ని తయారు చేసుకునే వరకు ఒరిజనల్ ను జిరాక్స్ తీయించి భద్రపరచుకోవాలి.


• ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే గెజిటెడ్ అధికారి నుంచి అటెండర్ వరకు వర్తిస్తాయి.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page