స్థానిక సెలవు APpeaLS లో -వివరణ
స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి. G.O.Ms.No.308 Edn తేది:19-02-1970 LOCAL HOLIDAYS:
ఎలా తీసుకోవాలి-ఎప్పుడు తీసుకోవాలి
లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు.
LH ప్రకటించడానికి అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు మాత్రమే
@ గ్రామ దేవత పండుగ
@ స్ధానిక జాతర
@ ముఖ్యమైన పండుగ
@ తొలి ఏకాదశి
@ నాగుల చవితి
@ కార్తీక సోమవారం
@ దీపావళి ముందు రోజు
@ మహా శివరాత్రి మరుసటి రోజు
@ హేబిటేషన్/పాఠశాల పరిధిలో
@ అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు
గమనిక - School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు.
Local Holiday ని ఉపాధ్యాయులు APpeaLS లో అప్లై చేయవలసిన అవసరం లేదు.
ఏ పాఠశాల వారైతే లోకల్ హాలిడే ఇవ్వదలచి చుకున్నారో వారు మీ DDO గారికి రాతపూర్వకంగా తెలియజేయాలి.
లోకల్ శెలవు option MEO login లో వుంటుంది. CSE సైట్ లో లాగిన్ అయ్యాక లోకల్ హాలిడే select చేసి ఏ స్కూల్ శెలవు ఇచ్చారో ఆ స్కూల్ dise కోడ్ సెలెక్టుచేసి submit చేయాలి. ఆ సెలవు ఏరోజు ఇస్తే ఆరోజే ఈ పని చేయాలి. ముందురోజు చేయకూడదు అన్ని హైస్కూల్స్, UP/primary ఎవరికైనా ఇదే పద్దతి. ఏ టీచర్ వ్యక్తిగతంగా అప్లై చేయరాదు. Aptels app లో లోకల్ సెలవు ఆప్షన్ లేదు.