top of page
Writer's pictureAPTEACHERS

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ

Updated: Aug 23, 2021

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ


స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు "స్థానిక సెలవులు" స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి. G.O.Ms.No.308 Edn తేది:19-02-1970 LOCAL HOLIDAYS:

ఎలా తీసుకోవాలి-ఎప్పుడు తీసుకోవాలి లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు. LH ప్రకటించడానికి అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు మాత్రమే @ గ్రామ దేవత పండుగ @ స్ధానిక జాతర @ ముఖ్యమైన పండుగ @ తొలి ఏకాదశి @ నాగుల చవితి @ కార్తీక సోమవారం @ దీపావళి ముందు రోజు @ మహా శివరాత్రి మరుసటి రోజు @ హేబిటేషన్/పాఠశాల పరిధిలో @ అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు గమనిక - School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి MEO/DEO కు ముందు సమాచారం ఇచ్చి ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు.


Local Holiday ని ఉపాధ్యాయులు APpeaLS లో అప్లై చేయవలసిన అవసరం లేదు.


ఏ పాఠశాల వారైతే లోకల్ హాలిడే ఇవ్వదలచి చుకున్నారో వారు మీ DDO గారికి రాతపూర్వకంగా తెలియజేయాలి.


లోకల్ శెలవు option MEO login లో వుంటుంది. CSE సైట్ లో లాగిన్ అయ్యాక లోకల్ హాలిడే select చేసి ఏ స్కూల్ శెలవు ఇచ్చారో ఆ స్కూల్ dise కోడ్ సెలెక్టుచేసి submit చేయాలి. ఆ సెలవు ఏరోజు ఇస్తే ఆరోజే ఈ పని చేయాలి. ముందురోజు చేయకూడదు అన్ని హైస్కూల్స్, UP/primary ఎవరికైనా ఇదే పద్దతి. ఏ టీచర్ వ్యక్తిగతంగా అప్లై చేయరాదు. Aptels app లో లోకల్ సెలవు ఆప్షన్ లేదు.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page