top of page

Child care leave for women Employees🤱🏻(శిశు సంరక్షణ సెలవు).

Child care leave for women Employees

🤱🏻(శిశు సంరక్షణ సెలవు)


▪️10 వ PRC సిఫార్సు పాక్షికంగా అమలు లో భాగంగా G.O Ms No 132 dt 6.7.2016 లోని 1(a) నిబంధన ద్వారా మహిళా ఉద్యోగినుల పిల్లలకు 18 ఏళ్ళ వయస్సు ( వికలాంగులుగా లైతే 22 ఏళ్ళ వయస్సు) వచ్చువరకు 60 రోజుల Child care leave ను 3 కంటే తక్కువ కాని Spells లో వాడుకోవచ్చు.


తల్లి వయస్సు/ సర్వీసు తో సంబంధం లేకుండా Service లో ఎప్పుడైనా .


▪️చివరి బిడ్డకు 18 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలి.


▪️11 వ PRC సిఫార్సు కనుగుణంగాG.O Ms No 33 dt 8.3.2022 ప్రకారము G.O 132 లోని Conditions తోనే ఈ Child care leave పరిమితిని 60 నుండి 180 రోజులకు పెంచబడినది.ఈ సదుపాయమును Unmarried /Widower/Divorcee గా ఉన్న పురుష ఉద్యోగులకు కూడా కల్పించబడినది.


▪️ G.O Ms No 199 dt 19 .10.2022 ద్వారా G.OMS No 33 లో తెల్పిన 180 రోజుల Child care leave ను గరిష్టంగా 10 spell s లో Entire service లో వాడుకొనవచ్చును అని సూచనలు ఇస్తూ G.O 132 లోని అన్ని Conditions వర్తిస్తాయని తెలపటం జరిగినది.Entire Service అనే మాట 60 మరియు 180 రోజుల CCL G.O లలో ఉన్నది.Entire Service లో ఆధారపడ్డ చివరిబిడ్డకు 18 ఏళ్ళ వయస్సు వచ్చు వరకు వాడుకొనవచ్చును.


▪️Entire Service అంటే CCL 180 రోజు‌ను బిడ్డల వయస్సు తో సంబంధం లేకుండా Service లో ఎప్పడైనా వాడుకోవచ్చని కాదు.దీని అర్థం తల్లి వయస్సు తో సంబంధం లేకుండా బిడ్డల వయస్సు 18 ఏళ్ళు(Ph అయితే 22ఏళ్ళు) వచ్చేవరకు మాత్రమే CCL ను Avail చేసుకోవటానికి అవకాశము.ఈ CCL కు బిడ్డల వయస్సే ప్రమాణము ( Criteria)


▪️ ఆధారిత బిడ్డల చదువు/అనారోగ్యము బారిన పడినప్పుడు ఈ CCL నువాడుకోవాలి.


▪️ ఈ సెలవు వాడుకొనే ముందే SR ల ఆధారిత పిల్లల పేర్లు వారి వయస్సులను తగు ధృవపత్రాలతో SR లో నమోదు చేసుకోవాలి.


▪️ చట్ట బధ్ధంగా దత్తత తీసుకొన్న బిడ్డలున్నవారు కూడా వారికి 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు ఇవే షరతులపై వాడు కొనవచ్చును.


▪️CCL ను EL/HPL/Medical leave/Maternity leave తో కలిపిExtension గా వాడుకొనవచ్చును కాని CL/Spl cl తో కలిపి వాడు కొనరాదు


▪️ CCL 4 నెలలు దాటితే Dy EO Sanction చేయాలి.

CCL ఒక సౌలభ్యము(Provision) మాత్రమే హక్కు కాదు.


▪️ ఉద్యోగము వచ్ఛిన 2 సంవత్సరాలలోపు , పదోన్నతి వచ్చిన ఒక సంవత్సరము లోపు CCL వాడుకొంటే ఎన్ని రోజులు వాడుకొంటే అన్ని రోజులు Probation(2or 1 yr) పొడిగించబడును.

17 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page