Child Care Leave (Andhra Pradesh)
- APTEACHERS
- Dec 30, 2023
- 1 min read
Child Care Leave (Andhra Pradesh)
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరియు 10 వ వేతన సంఘ సిఫార్సుల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు G.O.Ms.No.132 ఆర్ధిక (HR IV-FR) శాఖ, 06.07.2016 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ కల్పించ బడింది.
ఎన్ని రోజులు ఏ విధంగా పొందవచ్చు
సర్వీసు మొత్తం లో 180 రోజులు పొందవచ్చు. (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
కనీసం మూడు స్పెల్ల్స్ కు తగ్గకుండా వాడుకోవాలి.
గరిష్టంగా 10 స్పెల్ల్స్ కు మించకుండా వాడుకోవాలి. (G.O.Ms.No.199 ఆర్ధిక (HR IV & LR) శాఖ, 19.10.2022).
చైల్డ్ కేర్ లీవ్ ని హక్కు గా పొందలేరు. తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందిన తదుపరి మాత్రమే ఉపయోగించుకొనవలెను.
క్యాజువల్ లీవ్ మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్ మినహా మిగిన అన్ని రకాల సెలవులకు కొనసాగింపు గా ఈ సెలవు ఉపయోగించు కొనవచ్చును.
సంపాదిత సెలవు మంజూరు చేయు అధికారం ఉన్న వారు దీనిని మంజూరు చేయవచ్చును.
అర్హులు
18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు. (పిల్లలు విభిన్న ప్రతిభావంతులు అయినచో 22 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించు కోవచ్చు)
పిల్లలు సదరు ఉద్యోగి పై ఆధార పడి ఉండాలి.
పురుష ఉద్యోగులు సింగిల్ పేరెంట్స్ అయినచో (వివాహం కాని వారు, విడాకులు తీసుకున్న వారు, భార్య చనిపోయిన వారు). (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
ప్రొబేషన్ లో ఉన్నవారు కూడా ఈ సెలవు పొందుటకు అర్హులు. ప్రొబేషన్ లో ఉండగా ఈ సెలవు ఉపయోగించుకొనడం వల్ల ప్రొబేషన్ పొడిగింప బడుతుంది .
దేని కొరకు ఉపయోగించి కొనవచ్చును
పిల్లల చదువు, అనారోగ్య కారణాలు, వారి సంరక్షణ కొరకు ఏ అవసరాలకు అయినా సరే ఉపయోగించుకొన వచ్చును.
ఈ సెలవును ఉద్యోగి యొక్క చైల్డ్ కేర్ సెలవు ఖాతాలో మాత్రమే తగ్గించవలెను. సంపాదిత సెలవు (EL) లేదా అర్ధ వేతన సెలవు ఖాతాలో తగ్గించ కూడదు
ఇతర నిబంధనలు
ఈ సెలవు కాలంలో లీవ్ ట్రావెల్ కన్సిషన్ ఉపయోగించు కోకూడదు.
ఉద్యోగి కి ఈ సెలవు మంజూరు చేయడం వల్ల కార్యాలయం ద్వారా నిర్వహించ బడే ప్రభుత్వ కార్యకలాపాల పై ప్రభావం లేకుండా కార్యాలయ అధికారి జాగ్రత్త వహించ వలెను.
సూచన:-
చైల్డ్ కేర్ సెలవు వాడుకోవడానికి ముందుగా ఉద్యోగి కుటుంబ సభ్యులను డిక్లేర్ చేస్తూ సర్వీసు రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయంచుకొన వలెను. (Family Members Declaration Form )