సీపీఎస్ ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు క్రింది విధంగా
● CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?
Pension Fund Regulatory and Development Authority వారు సర్కులర్ నెంబర్ PFRDA/2018/40/Exit Dt: 10-01-2018 ప్రకారం NPS Partial withdrawal ఎలా చేసుకోవాలి ఉత్తర్వులు విడుదల చేసినారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింది సందర్భాలలో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.
🍥పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
🍥పిల్లల వివాహ నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
🍥గృహ నిర్మాణం లేదా ప్లాట్ కొనుగోలు నిమిత్తం.
🍥చందాదారుడు, భార్య, పిల్లలు, చందదారుడు మీద ఆధారపడిన తల్లిదండ్రులు వైద్య ఖర్చులు నిమిత్తం కూడా ఉపసంహరించుకోవచ్చు.
● వర్తించేవ్యాధులు:
A) Cancer .
B) Kidney Failure (End Stage Renal Failure.
C) Primary Pulmonary Ariterial Hypertension . D) Multiple Sclerosis .
E) Major Organ Transplant .
F) Coronary Artery Bypass Graft .
G) Aorta Graft Surgery .
H) Heart Valve Surgery .
I) Stroke.
j) Myocardial Infraction.
K) Coma.
L) Total blindness .
M) Paralysis .
N) Accident of serious/life threatening nature.
O) Any other critical illness of a life threatening nature as stipulated in the circulars, guidelines of notifications issued by the Authority from time to time.
● పాక్షిక ఉపసంహరణకు నిబంధనలు:-
🍥నూతన పెన్షన్ పథకంలో చేరిన మూడు సంవత్సరాలు పూర్తి కాబడిన వారే అర్హులు.
🍥చందదారుడు చెల్లించిన దానిలో దరఖాస్తు చేసేనాటికి ఉన్న దానిలో 25% వరకు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.
🍥ఏమైన నివాసం చందదారుడు పేర, సంయుక్తంగా కలిగి ఉన్న కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహరించలేరు.
● గరిష్ఠంగా ఎన్ని సార్లు ఉపసంహరణ చేసుకోవచ్చు:-
🍥చందదారుడు తన సర్వీసు మొత్తంలో గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతినిస్తారు. చందదారుడు ఉపసంహరణ కొరకు Central Recording keeping Agency లేదా National Pension System Trust కు దరఖాస్తు నోడల్ అధికారి ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. చందదారుడు అనారోగ్యంతో బాధ పడుచున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా చందదారుడు తరుపున దరఖాస్తు సమర్పించవచ్చు. పాక్షిక ఉపసంహరణ కొరకు "ఫారం 601 PW " సమర్పించాల్సి ఉంటుంది.
మన ప్రాన్ అకౌంట్ నుండి 25% పార్సియల్ విత్ డ్రాల్ చేసుకునే విధానం.
Partial withdrawal process :
1. Login into nsdl cra
2. Transact online
3. Withdrawal
4.partial withdrawal for tire1
5. Intiate conditional withdrawal
6. Percentage to be withdrawal (25%)
7. Purpose of withdrawal
8. Submit
9.up load file ( self declaration form in pdf)
10. Bank a/c verification
11. Confirm
12. OTP/ e sign ( use any one option)
Note : OTP send to mobile and mail ..both mails are entered in this process.