ప్రభుత్వ శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపధ్యంలో అసలు డిపార్టుమెంటల్ పరీక్షలు ఎందుకు వ్రాయాలి. ఉపాధ్యాయులకు కొంత వివరణ అందించే ప్రయత్నం చేస్తున్నాను.
👉G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం..
అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)
💥అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
💥 కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.ఎటువంటి మినహాయింపు లేదు.
💥 స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
☄స్కూల్ అసిస్టెంట్ లు రాజస (Gazetted) ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
☄ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
☄ 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
💥 Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:
⚡ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) Paper Code.37 వ్రాయాలి.
⚡పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.
💥 డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?
💦 ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు (Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.
💦 అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.