జగనన్న గోరుముద్ద నూతన మెనూ విధానం - ఆర్గనైజేషన్ వారు విధులు బాధ్యతలు
జగనన్న గొరుముద్ద నూతన మెనూ విధానం సక్రమంగా అమలు చేయడానికి పరిశీలన నిమిత్తం నాలుగు అంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలు కోసం గౌరవ ప్రధానోపాధ్యాయులు ,తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు విలేజ్ ఆర్గనైజేషన్ వారు ముఖ్యపాత్ర వహిస్తారు.
విధులు బాధ్యతలు
1. ప్రధానోపాధ్యాయులు.
పాఠశాలకు విద్యార్థులు రోజు హాజరయ్యే విధంగా కృషి చేయవలెను .
మధ్యాహ్న భోజన పథకం నిర్వహించేటప్పుడు క్వాంటిటీ మరి క్వాలిటీ తగ్గకుండా ఉండేవిధంగా చూడవలెను .
అలానే వంట ఏజెన్సీ పరిశుభ్రతను గమనించవలెను.
విద్యార్థులందరికీ శుభ్రమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించే విధంగా కృషి చేయవలెను .
ఏదైనా అతిక్రమించే సందర్భాలు ఎదురైనపుడు పై అధికారులకు విషయాన్ని తెలియ పరచ వలెను మరియు పథకం అభివృద్ధి కొరకు సూచనలు మరియు సలహాలను తీసుకోవలెను.
భోజనం చేసే విధానం, భోజనానికి హాజరు, గుడ్ల వినియోగం కు సంబంధించి ప్రతి రోజు మొబైల్ యాప్ ను వినియోగించడం.
మధ్యాహ్న భోజన పథకానికి ఒక సహ ఉపాధ్యాయుని పర్యవేక్షణకు వినియోగించాలి.
పిల్లలందరినీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా, నీటి యొక్క వినియోగం శుభ్రతను పాటించే విధంగా, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా విద్యార్థుల్ ను ప్రధానోపాధ్యాయులు వారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారికి ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వివరాలు తెలియ పరుస్తూ వారి యొక్క సూచనలు మరియు సలహాలను ఈ పథకం అమలయ్యే విధంగా ఉండటం కోసం తీసుకోవాల్సి ఉంటుంది.
2. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు
వీ పాఠశాల ఉపాధ్యాయులకు సన్నిహితంగా మరియు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించి అలాగే పథకం అమలు జరిగేటప్పుడు పరిశుభ్రతను గమనిస్తూ వుండాలి.
విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంచే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే చిక్కీలు మరి గుడ్లు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీ నాణ్యత గల వాటిని ఉపయోగించే విధంగా చూడాలి .
ప్రతినెల జరిగే కమిటీ మీటింగ్ సమావేశాలలో తమ యొక్క అమూల్యమైన సలహాలను పాఠశాల అభివృద్ధి కొరకు ఇస్తూ ఉండాలి.
టీచర్- పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ తప్పనిసరిగా నిర్వహించేటట్లు చూసి విద్యార్థుల యొక్క అభివృద్ధి కొరకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి.
3.సంక్షేమం మరియు విద్య సహాయకుడు
మధ్యాహ్న భోజన పథకం అన్ని పాఠశాలలో జరిగే విధంగా వారి యొక్క గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ పరిధిలో పర్యవేక్షణ చేయాలి.
ప్రధాన ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా పాఠశాలకి వెళ్లి హాజరు యొక్క పర్యవేక్షణ మరియు మధ్యాహ్న భోజన పథకం వినియోగాన్ని పరిశీలించి ఏవైనా అవాంతరాలు గమనించినచో వాటిని తొలగించే విధంగా కృషి చేయాలి.
కనీసం వారంలో 3 పాఠశాలను తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేయాలి.
మధ్యాహ్న భోజన పథకం మెనూ రోజువారి సక్రమంగా జరుగుతుందో లేదో చూడాలి
ఇంతకుముందు జరిగిన పరిశీలనలు ఎంతవరకు అభివృద్ధి చేశారు తప్పనిసరిగా సంబంధించిన బుక్ లో నమోదు చేయాలి .
ప్రధాన ఉపాధ్యాయులు వారికి సూచనలు సలహాలు ఇస్తూ క్వాంటిటీ మరి క్వాలిటీ తగ్గకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందించే విధంగా చూడాలి.
మధ్యాహ్న భోజన పథకం గురించి తల్లిదండ్రుల కమిటీలతో మాట్లాడి పథకం అభివృద్ధి కోసం వారి సలహాలు సూచనలు తీసుకోవాలి.
4.స్వయం సహాయక బృందాలు
పాఠశాల పరిశుభ్రతను నీటి యొక్క వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి .
పాఠశాల తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ తో కలిసి స్వయం సహాయక బృందాలు సంబంధించిన వారు రొటేషన్ పద్ధతిలో వండే విధానాన్ని, పరిశుభ్రతను గమనిస్తూ ఉండాలి .
పాఠశాల తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ వారితో మాట్లాడి పాఠశాల అభివృద్ధికి డొనేషన్లు, విద్యార్థులకు అదనంగా ఏదైనా అవసరమైన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలి.
అంతేకాకుండా పండుగలు పెళ్ళిళ్ళు పుట్టిన రోజులలో ప్రత్యేకమైన ఆహారాన్ని అందించే విధంగా కృషి చేయాలి.
తల్లిదండ్రుల్ని కలిసి విద్యార్థులు చక్కగా పాఠశాలలో చదువుకునే విధంగా మరియు వాళ్ళల్లో పోటీతత్వం పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి.
ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా స్వయం సహాయక బృందాలు పాఠశాలలను తప్పనిసరిగా తనఖీ చేయవలసి ఉంటుంది.