top of page
Writer's pictureAPTEACHERS

జగనన్న గోరుముద్ద నూతన మెనూ విధానం - ఆర్గనైజేషన్ వారు విధులు బాధ్యతలు

Updated: Aug 23, 2021


జగనన్న గోరుముద్ద నూతన మెనూ విధానం - ఆర్గనైజేషన్ వారు విధులు బాధ్యతలు


జగనన్న గొరుముద్ద నూతన మెనూ విధానం సక్రమంగా అమలు చేయడానికి పరిశీలన నిమిత్తం నాలుగు అంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలు కోసం గౌరవ ప్రధానోపాధ్యాయులు ,తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు విలేజ్ ఆర్గనైజేషన్ వారు ముఖ్యపాత్ర వహిస్తారు.

విధులు బాధ్యతలు

1. ప్రధానోపాధ్యాయులు.

 పాఠశాలకు విద్యార్థులు రోజు హాజరయ్యే విధంగా కృషి చేయవలెను .

 మధ్యాహ్న భోజన పథకం నిర్వహించేటప్పుడు క్వాంటిటీ మరి క్వాలిటీ తగ్గకుండా ఉండేవిధంగా చూడవలెను .

 అలానే వంట ఏజెన్సీ పరిశుభ్రతను గమనించవలెను.

 విద్యార్థులందరికీ శుభ్రమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించే విధంగా కృషి చేయవలెను .

 ఏదైనా అతిక్రమించే సందర్భాలు ఎదురైనపుడు పై అధికారులకు విషయాన్ని తెలియ పరచ వలెను మరియు పథకం అభివృద్ధి కొరకు సూచనలు మరియు సలహాలను తీసుకోవలెను.

 భోజనం చేసే విధానం, భోజనానికి హాజరు, గుడ్ల వినియోగం కు సంబంధించి ప్రతి రోజు మొబైల్ యాప్ ను వినియోగించడం.

 మధ్యాహ్న భోజన పథకానికి ఒక సహ ఉపాధ్యాయుని పర్యవేక్షణకు వినియోగించాలి.

 పిల్లలందరినీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా, నీటి యొక్క వినియోగం శుభ్రతను పాటించే విధంగా, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా విద్యార్థుల్ ను ప్రధానోపాధ్యాయులు వారు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారికి ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వివరాలు తెలియ పరుస్తూ వారి యొక్క సూచనలు మరియు సలహాలను ఈ పథకం అమలయ్యే విధంగా ఉండటం కోసం తీసుకోవాల్సి ఉంటుంది.

2. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు

 వీ పాఠశాల ఉపాధ్యాయులకు సన్నిహితంగా మరియు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించి అలాగే పథకం అమలు జరిగేటప్పుడు పరిశుభ్రతను గమనిస్తూ వుండాలి.

 విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంచే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

 అలాగే చిక్కీలు మరి గుడ్లు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీ నాణ్యత గల వాటిని ఉపయోగించే విధంగా చూడాలి .

 ప్రతినెల జరిగే కమిటీ మీటింగ్ సమావేశాలలో తమ యొక్క అమూల్యమైన సలహాలను పాఠశాల అభివృద్ధి కొరకు ఇస్తూ ఉండాలి.

 టీచర్- పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ తప్పనిసరిగా నిర్వహించేటట్లు చూసి విద్యార్థుల యొక్క అభివృద్ధి కొరకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి.


3.సంక్షేమం మరియు విద్య సహాయకుడు

 మధ్యాహ్న భోజన పథకం అన్ని పాఠశాలలో జరిగే విధంగా వారి యొక్క గ్రామ మరియు వార్డు సెక్రటేరియట్ పరిధిలో పర్యవేక్షణ చేయాలి.

 ప్రధాన ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా పాఠశాలకి వెళ్లి హాజరు యొక్క పర్యవేక్షణ మరియు మధ్యాహ్న భోజన పథకం వినియోగాన్ని పరిశీలించి ఏవైనా అవాంతరాలు గమనించినచో వాటిని తొలగించే విధంగా కృషి చేయాలి.

 కనీసం వారంలో 3 పాఠశాలను తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేయాలి.

 మధ్యాహ్న భోజన పథకం మెనూ రోజువారి సక్రమంగా జరుగుతుందో లేదో చూడాలి

 ఇంతకుముందు జరిగిన పరిశీలనలు ఎంతవరకు అభివృద్ధి చేశారు తప్పనిసరిగా సంబంధించిన బుక్ లో నమోదు చేయాలి .

 ప్రధాన ఉపాధ్యాయులు వారికి సూచనలు సలహాలు ఇస్తూ క్వాంటిటీ మరి క్వాలిటీ తగ్గకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందించే విధంగా చూడాలి.

 మధ్యాహ్న భోజన పథకం గురించి తల్లిదండ్రుల కమిటీలతో మాట్లాడి పథకం అభివృద్ధి కోసం వారి సలహాలు సూచనలు తీసుకోవాలి.


4.స్వయం సహాయక బృందాలు

 పాఠశాల పరిశుభ్రతను నీటి యొక్క వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి .

 పాఠశాల తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ తో కలిసి స్వయం సహాయక బృందాలు సంబంధించిన వారు రొటేషన్ పద్ధతిలో వండే విధానాన్ని, పరిశుభ్రతను గమనిస్తూ ఉండాలి .

 పాఠశాల తల్లిదండ్రుల అభివృద్ధి కమిటీ వారితో మాట్లాడి పాఠశాల అభివృద్ధికి డొనేషన్లు, విద్యార్థులకు అదనంగా ఏదైనా అవసరమైన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలి.

 అంతేకాకుండా పండుగలు పెళ్ళిళ్ళు పుట్టిన రోజులలో ప్రత్యేకమైన ఆహారాన్ని అందించే విధంగా కృషి చేయాలి.

 తల్లిదండ్రుల్ని కలిసి విద్యార్థులు చక్కగా పాఠశాలలో చదువుకునే విధంగా మరియు వాళ్ళల్లో పోటీతత్వం పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి.

 ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా స్వయం సహాయక బృందాలు పాఠశాలలను తప్పనిసరిగా తనఖీ చేయవలసి ఉంటుంది.

7 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page