అమ్మఒడి తాజా మార్గదర్శకాలు సూచనలు... సబ్మిషన్లో పైనల్ టైం షెడ్యూల్.. ,Rc.242, Dt. 20/12/2019
పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు I.A.S
ఆర్.సి. నెం. 242/ఎ & ఐ/2019, తేది : 20.12.2019
విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
నిర్దేశములు :
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019
4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2.12.2019
ఆదేశములు
'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2, 3 మరియు 4 లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
తదుపరి కార్యక్రమాలు ఈ క్రింది విధంగా చేయాల్సిందిగా కోరడమైనది.
1) 22.12.2019 - ప్రొఫార్మా-1 మరియు ప్రొఫార్మా -2లను పూర్తి చేయుట.
2) 24.12.2019 - ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియెట్ విద్య వారి సమాచారాన్ని సంయుక్తం చేసి అర్హులైన ఒకే తల్లి/ సంరక్షకులను గుర్తించుట.
3) 26.12.2019 మరియు 27.12.2019 - సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా అనుమతి పొందుట.
4) 29.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపించుట.
5) 30.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు
పంపుట.
6) 31.12.2019 - జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి అనుమతి కొరకు పంపుట.
7) 01.01.2020 - జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొందిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారి కార్యాలయానికి పంపుట.
ఈ అంశంపై సమగ్రమైన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారు మరియు పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు 20.12.2019న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియజేయడమైనది.
Sd/
కమీషనర్, పాఠశాల విద్య (పూ. అ.బా)
Click here to download proceedings 👇
https://drive.google.com/file/d/1-LA4nRi-QkzJNnNWSEnCw20MOVO7t1h9/view?usp=drivesdk