top of page

సందేహం--సమాధానం ప్రశ్న: నేను పదవీ విరమణ చేసాను.నా యొక్క ఖాతాలో 264 రోజులు హాఫ్ పే లీవ్,సంపాధిత సెలవులు 49 ఉన్నాయి.వీటిని నగదుగా ఎలా మార్చుకోవాలి?? జవాబు: పదవీ విరమణ చేసిన సందర్భంలో సంపాదిత,అర్ధజీతపు సెలవు కలిపి 300 రోజుల వరకు నగదుగా మార్చుకోవచ్చు.మీకు 49 ELs ఉన్నాయి కాబట్టి 251 రోజులు హాఫ్ పే లీవ్ ను నగదుగా మార్చుకోవచ్చు. ప్రశ్న: GIS రేట్లు తెలుపగలరు?? జవాబు: GIS అనేది 1.11.1984 నుండి ప్రారంభం అయింది.1.11.84 నుండి యూనిట్ విలువ 10/- గాను, 1.11.94 నుండి 15/- గాను ఉన్నది. ప్రశ్న: ఒక CPS ఉద్యోగి మరణించాడు.ఆయన భార్యకు కుటుంబ పెన్షన్ వస్తుందా?? జవాబు: జీఓ.121; తేదీ:18.7.2017 ప్రకారం CPS లో నిల్వయున్న డబ్బులు కావాలో??పెన్షన్ కావాలో??అనేది కుటుంబ పింఛనుదారు ఆప్షన్ ఇవ్వవలసిన ఉంటుంది. కుటుంబ పెన్షన్ కావాలి అంటే, CPS లో నిల్వయున్న మొత్తం ప్రభుత్వంనకు జమచేయాల్సి ఉంటుంది.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page