top of page
Writer's pictureAPTEACHERS

సందేహం--సమాధానo

Updated: Aug 24, 2021

సందేహం--సమాధానం ప్రశ్న: నేను పదవీ విరమణ చేసాను.నా యొక్క ఖాతాలో 264 రోజులు హాఫ్ పే లీవ్,సంపాధిత సెలవులు 49 ఉన్నాయి.వీటిని నగదుగా ఎలా మార్చుకోవాలి?? జవాబు: పదవీ విరమణ చేసిన సందర్భంలో సంపాదిత,అర్ధజీతపు సెలవు కలిపి 300 రోజుల వరకు నగదుగా మార్చుకోవచ్చు.మీకు 49 ELs ఉన్నాయి కాబట్టి 251 రోజులు హాఫ్ పే లీవ్ ను నగదుగా మార్చుకోవచ్చు. ప్రశ్న: GIS రేట్లు తెలుపగలరు?? జవాబు: GIS అనేది 1.11.1984 నుండి ప్రారంభం అయింది.1.11.84 నుండి యూనిట్ విలువ 10/- గాను, 1.11.94 నుండి 15/- గాను ఉన్నది. ప్రశ్న: ఒక CPS ఉద్యోగి మరణించాడు.ఆయన భార్యకు కుటుంబ పెన్షన్ వస్తుందా?? జవాబు: జీఓ.121; తేదీ:18.7.2017 ప్రకారం CPS లో నిల్వయున్న డబ్బులు కావాలో??పెన్షన్ కావాలో??అనేది కుటుంబ పింఛనుదారు ఆప్షన్ ఇవ్వవలసిన ఉంటుంది. కుటుంబ పెన్షన్ కావాలి అంటే, CPS లో నిల్వయున్న మొత్తం ప్రభుత్వంనకు జమచేయాల్సి ఉంటుంది.

Recent Posts

See All

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి? ★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు...

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page