top of page

📝APGLI ప్రీమియం పెంచిన అమౌంట్ కు కొత్త బాండ్ సమాచారం:


APGLI అమౌంట్ పెంపుదల ( enhance) చేసినవారు కొత్త బాండు కొరకు nidhi apcfss నందు ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయడం.



నిధి పోర్టల్ నందు ఏపీజి ఎల్ఐ ప్రీమియం పెంచిన అమౌంట్ కు కొత్త బాండ్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తును సబ్మిట్ చేయాలి...


ఆన్లైన్ దరఖాస్తు లో:-


1) మొదటి భాగం:- బేసిక్ డీటెయిల్స్


2) రెండో భాగం:- నామిని డీటెయిల్స్ ఉంటాయి.


👉 ఎవరైతే పెంచిన ప్రీమియం వారి యొక్క బేసిక్ పే లో 8% శాతం కంటే ఎక్కువ పెంచి నచో (ఉదాహరణA ఉద్యోగి బేసిక్ పే50000/-అయితే50000×8/100=4000/-) వారు

i) నాన్ అవైల్ మెంట్ మెడికల్ సర్టిఫికెట్(డిడిఓ అధికారి ఇస్తారు)

ii) గుడ్ హెల్త్ సర్టిఫికెట్ ను (గుడ్ హెల్త్ సర్టిఫికెట్ మీద అసిస్టెంట్ సివిల్ సర్జన్ చేత సంతకం చేయించాలి) పై రెండు సర్టిఫికెట్లను

తీసుకొని 1MB సైజ్ లో పిడిఎఫ్ లో సేవ్ చేసుకుని పెట్టుకోని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి.


2. రెండవ భాగం: నామిని డీటెయిల్స్ ఇందులో నామిని పేరు డేట్ అఫ్ బర్త్, ఆధార్ నెంబరు, డేట్ అఫ్ బర్త్ కి సపోర్ట్ డాక్యుమెంట్స్ (ఆధార్ కార్డు కాకుండా)మరియు నామిని ఆధార్ నెంబర్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తాయి. ఇవన్నీ సబ్మిషన్ చేస్తే నామిని డీటెయిల్స్ పూర్తవుతుంది.

ఆ తర్వాత డి డి ఓ లాగిన్ కి వెళుతుంది మన ప్రపోజల్ దరఖాస్తు ఆన్లైన్ ఫారం పూర్తవుతుంది...



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page