ఉద్యోగస్తులకు సంబంధించి ఇన్కమ్ టాక్స్ పూర్తి సమాచారం
వ్యక్తిగత సమాచారం:
1. పూర్తి పేరు
2. ఉద్యోగం స్థాయి
3. పనిచేస్తున్న గ్రామం, మండలం
4. ఉద్యోగి ట్రెజరీ ఐడి / CFMS ఐడి
5. ఉద్యోగి పాన్ కార్డు నెంబర్
6. ఉద్యోగి CPS లేదా OPS
DDO వివరాలు:
1. మీ డ్రాయింగ్ ఆఫీసర్ పూర్తి పేరు
2. DDO పనిచేస్తున్న స్కూల్ లేదా ఆఫీస్
3. DDO PAN నంబర్
4. DDO TAN నంబర్
పాత విధానం లో అయితే కావలసిన అంశాలు:
1. మార్చి 2023 నాటి పే
2. ఇంక్రిమెంట్ నెల
3. EL'S తీసుకుంటే ఎన్ని, ఏ నెలలో
4. HRA శాతం
5. ZPPF నెలవారీ చెల్లింపు
6. APGLI నెలవారీ చెల్లింపు
7. ఎంప్లాయ్ హెల్త్ స్కీం చెల్లింపు
8. ప్రతి నెల కడుతున్న ఐటీ టాక్స్ (నెలలలో చెల్లింపు మార్పులు ఉంటే వాటితో)
9. పిల్లల ట్యూషన్ ఫీజ్
10. ఈ ఆర్థిక సంవత్సరం లో LIC చెల్లింపులు
11. సుకన్య యోజన (ఆడపిల్లలకు)
12. ఇంటి అద్దె రసీదు (నెలకు 8300 లోపు చెల్లింపు అయితే ఇంటి యజమాని PAN కార్డు అవసరం లేదు. దానికి పైబడి ఉంటే యజమాని PAN కార్డు తప్పనిసరి.)
13. గృహ రుణం తీసుకుంటే దాని రసీదు(ప్రిన్సిపల్ మొత్తం వడ్డీ వేరు వేరుగా లెక్కించి ఉండాలి.)
14. ఎంప్లాయ్ వెల్ ఫేర్ ఫండ్ చెల్లింపు
15. సైనిక వెల్ఫేర్ ఫండ్ చెల్లింపు
16. HM అలవెన్సు
17. ఏదైనా స్పెషల్ పే ఉంటే దాని మొత్తం..
కొత్త విధానం లో IT అయితే కావలసిన అంశాలు:
1. మార్చి 2023 నాటి పే
2. ఇంక్రిమెంట్ నెల
3. EL'S తీసుకుంటే ఎన్ని, ఏ నెలలో
4. HRA శాతం
5. ZPPF నెలవారీ చెల్లింపు
6. APGLI నెలవారీ చెల్లింపు
7. ఎంప్లాయ్ హెల్త్ స్కీం చెల్లింపు
8. ప్రతి నెల కడుతున్న ఐటీ టాక్స్ (నెలలలో చెల్లింపు మార్పులు ఉంటే వాటితో)
8. గృహ రుణం ఉంటే వాటి చెల్లింపు వివరాలు.
ముఖ్య సమాచారం:
ఆడిటర్ సమాచారం మేరకు మీకు తెలియపరిచేది ఏమిటంటే ఒక ఎంప్లాయ్ కి old రెజిమ్ లేదా new రెజిమ్ టాక్స్ లలో ఏది బెనిఫిట్ గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ ఫైనాన్సిల్ ఇయర్ new regime సెలెక్ట్ చేసుకుంటే తరువాత ఫైనాన్సిల్ ఇయర్ కి new regime సెలెక్ట్ చేసుకోవాలనేమి లేదు. Old or new regim లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు.
DDO గారికి మీరు ఓకేవేళ NEW REGIM టాక్స్ సబ్మిట్ చేసినా ఇ-ఫైలింగ్ లో Old Regim కి కూడా మారవచ్చు. Old Regime సబ్మిట్ చేసినా E-ఫైలింగ్ లో New Regim కి మారొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు.
కావున ఉపాధ్యాయులు మీకు ఏది బెనిట్ గా వుందో ఆ Tax Regime ఎంచుకోవాల్సింది.
ఈ విషయాల మీద నిన్న ఆడిటర్ ని కలిసి సూచనలు తీసుకొని మీకు సమాచారం అందించడం జరిగింది.
SECTION 80G:
• కొంత మందికి పూర్తి స్థాయిలో Tax pay చేసే అవకాశం ఉన్న, చేయకుండా, తమ దగ్గర లో ఉన్న ధార్మిక సంస్థల కు తమ వంతు సహకారం గా విరాళాలు ఇవ్వాలని అనుకొంటారు. సో మనం ఇచ్చే దానిలో 20%amount మాత్రమే మనకు tax లో save అవుతుంది.
Ex. 20000 ఇస్తే. 4 వేలు తగ్గుతుంది. కనుక మీరు ఇవ్వాలని అనుకున్న amount ఇవ్వండి.
కానీ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి...
1. డబ్బు రూపం లో అయితే 2000. అంతకు మించి ఇవ్వరాదు.
2. 2 వేలు మించి other than cash mode లోనే ఇవ్వాలి.
Phone pe / google pe - Net Banking / NEFT / RTGS / cheque..ect.
3) మనం ఇచ్చే ధార్మిక సంస్థలు section 12A కి లోబడి registration అయి ఉన్నాయ లేవా, PAN card ఉందని నిర్ధారణ చేసి ఇవ్వాలి.
4) వస్తురూపం లో ఇస్తే చెల్లుబడి కాదు.
5) Address , Pin No., Society pan card compulsary గా Receipt లో ఉండే విధంగా చూసుకోవాలి.
6) మీరు చదువుకున్న, School/కాలేజీకి Society registration కింద Income Tax section 12A కి లోబడి PAN CARD ఉంటే, మీ మీ School కి కూడా ఇవ్వ వచ్చు.
7) CM relief fund అయితే GGGGG0000G default గా ఉంటుంది. PIN state capitl ది mention చేయవచ్చు.
8) Nation defence, Army, Flag Fund, Smile train, Red Cross, PM cares, ఇంకా మీకు తెలిసిన, temples కూడా ఇవ్వ వచ్చు, కాని PAN CARD మస్ట్ ఉండాలి.
గృహ ఋణం ఉన్నవాళ్లకి ఇన్కమ్ టాక్స్ నుంచి మినహాయింపు గురించి వివరణ:
1) 80EE: మీరు గృహ ఋణం 01.04.2016 to 31.03.2017 మధ్యన పొందివుంటే 50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి హౌస్ లోన్ ఇంట్రెస్ట్ మినహయింపు పొందవచ్చు.
✅ మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 50వేలు (80EE) = Rs. 2,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు.
2) 80EEA: మీరు గృహ ఋణం 1st April 2019 and 31st March 2022 మధ్యన పొందివుంటే 1,50,000 అదనంగా హౌస్ లోన్ ఇంట్రెస్ట్ మినహయింపు పొందవచ్చు.
✅ మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 1.5లక్షలు (80EE) = Rs.3,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు.
పై రెండు నిబంధనలు హౌస్ లోన్ తీసుకున్న వారి వర్తిస్తాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి.
80C లో 1.5 లక్ష కాకుండా టాక్స్ నుండి ఉపశమనం పొందడానికి క్రింది వాటి మీద దృష్టి పెట్టండి.
80CCD(1B) - నేషనల్ పెన్షన్ స్కీమ్ (నాన్ CPS కోసం) Max Rs.50000.
80TTA - పొదుపు ఖాతాపై వడ్డీ (స్థిర డిపాజిట్ కాదు) Max Rs.10000.
80EEB - ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు వడ్డీ Max Rs.150000.
80E - ఎడ్యుకేషనల్ లోన్ 80E Max Rs.1000000 వడ్డీ.
80EE - హౌసింగ్ లోన్ వడ్డీ 80EE Max Rs.50000.
80EEA - HBA లోన్ 80EEA Max Rs.150000 వడ్డీ.
80EEB - ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు వడ్డీ Max Rs.150000.
80D - మెడికల్ ఇన్సూరెన్స్ స్వీయ, జీవిత భాగస్వామి & పిల్లలు Max Rs.25000.
80CCG - రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్ Max Rs.25000.
80D - మెడికల్ ఇన్సూరెన్స్ కుటుంబం & తల్లిదండ్రులు (< 60) Max Rs.50000.
80D - మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ (< 60) కానీ తల్లిదండ్రులు (>60) Max Rs.75000.
80D - మెడికల్ ఇన్సూరెన్స్ కుటుంబం & తల్లిదండ్రులు (>60) Max Rs.100000.
80DDB - నిర్దిష్ట వ్యాధుల వైద్య చికిత్స (<60) Max Rs.40000.
80DDB - నిర్దిష్ట వ్యాధుల వైద్య చికిత్స (>=60) Max Rs.100000.
80DD - డిపెండెంట్ డిసేబుల్డ్ పర్సన్ (< 80% ) Max Rs.75000.
80DD - ఆధారిత వికలాంగ వ్యక్తి (> 80% ) Max Rs.100000.
80U - శారీరక వికలాంగుల అంచనా (80% కంటే తక్కువ) Max Rs. 75000.
80U - శారీరక వికలాంగుల అంచనా (80% పైన) Max Rs.125000.
80G - చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ విరాళం-50% Max Rs.500000.
80G - చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ విరాళం-100% Max Rs.250000.
80G - నిర్దిష్ట నిర్దిష్ట నిధులపై విరాళం-100% Max Rs.500000.
80G - ఎలక్టోరల్ ట్రస్ట్‌లకు చేసిన చెల్లింపులు-100% Max Rs.500000.
CPS Employees Income Tax section - 80CCD వివరణ:
కొత్త పెన్షన్ పైన నియామకమైన ఉద్యోగులు ఐటి మినహాయింపు కోసం ఉన్న సెక్షన్ 80CCD లో 3 SUB SECTIONS కలవు. అవి,
1. 80CCD(1)
2. 80CCD(1B)
3. 80CCD(2)
80CCD(1) వివరణ:
కొత్త పెన్షన్ పై నియామకమైన ఉద్యోగులు వారి నెలవారి జీతం నుండి మినహాయించే 10% CPS Amount ఈ సెక్షన్ క్రిందికి వస్తుంది. దీని గరిష్ట పరిమితి 1,50,000/-. ఇది 80C లో అంతర్భాగంగా ఉంటుంది, అనగా 80 C లోని ఇతర మినహాయింపులతో కలుపుకొని మొత్తం 1,50,000/- మించకూడదు.
80CCD(1B) వివరణ:
కొత్త పెన్షన్ పై నియామకమైన ఉద్యోగులకు ఈ సెక్షన్ కింద అదనంగా 50,000/- మినహాయింపు కలదు. 80C లోని ఇతర మినహాయింపులతో కలుపుకుని 80CCD(1) సొమ్ము 1,50,000 పరిమితిని దాటిన తరువాత మిగిలిన సొమ్ము 80CCD(1B) సెక్షన్ క్రిందికి వచ్చును. దీని గరిష్ఠ పరిమితి 50,000/-.
80CCD(2) వివరణ:
నూతన పెన్షన్ కింద నియామకమైన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రభుత్వం (Employer) విడుదల చేసే మ్యాచింగ్ గ్రాంట్ ఈ సెక్షన్ కిందికి వస్తుంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ను ఆదాయంలో కచ్చితంగా చూపించాలి మరియు ఈ సెక్షన్ కింద మినహాయింపుగా కూడా చూపించాలి. దీని గరిష్ఠ పరిమితి 1,50,000/-.
Income Tax House Rent information:
పని చేసే చోట నివాసమునకు IT లో House Rent Exemption కు సంబంధంలేదు. IT Act లో గాని, IT సంబంధంగా DTA ఇచ్చిన Instructions లో గాని ఎక్కడా ఆ నిబంధన లేదు. DDO/STO లు ఒత్తిడి చేస్తే Protest చేయవచ్చును.
• 100000 Annual House Rent వరకు ఎలాంటి రశీదు అవసరములేదు.
• Annual House Rent ఒక లక్ష దాటితే Owner PAN తో రశీదు తీసుకోవాలి.
• Gross లో 10% వరకు HR చెల్లింపు చూపుకొనవచ్చును.
• House Rent నెలకు 8,300 వరకు owner PAN CARD XEROX అవసరం లేదు.
• House Rent నెలకు 8,300 దాటితే owner PAN CARD XEROX కచ్చితంగా పెట్టాలి.
◾ఇన్కమ్ టాక్స్ సందేహాలు:
• సందేహం:
భార్య భర్తల్లో ఒకరు బారోవరు మరొకరు కోబారోవర్ గా ఉన్న హోమ్ లోన్ పై గరిష్ట పన్ను రాయితీ ఎంతో తెలుపగలరు?
• సమాధానం:
Case-i:
వార్షికంగా చెల్లించిన వడ్డీ 4,00,000 దాటితే *చెరో 2,00,000 వడ్డీ మినహాయింపు పొందవచ్చు.
Case-ii:
వార్షికంగా చెల్లించిన వడ్డీ 4,00,000 లోపు ఉంటే చెల్లించించిన మొత్తం వడ్డీని ఇద్దరూ ప్రపోర్సినేట్ గా వడ్డీ మినహాయింపు పొందవచ్చు. ఇందుకు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఫామ్ నమూనా.
• సందేహం:
భార్య unemployee. తన పేరున హోమ్ లోన్ ఉంది. ఆ హోమ్ లోన్ అకౌంట్ కి భర్త సాలరీ అకౌంట్ నుండే EMI ట్రాన్స్ఫర్ అవుతుంది. భర్త IT లో హోమ్ లోన్ చూపించడానికి వీలువుంటుందా? తెలుపగలరు.
• సమాధానం:
Co - applicant గా భర్త పేరు ఉంటే IT లో పెట్టు కోవచ్చు.