top of page

ఫిబ్రవరి 2024 నెలలో మీరు MEO ఆఫీసు /DDO కి సబ్మిట్ చేయవలసిన ఫారం 16 విషయంలో పాటించవలసిన అంశాలు.


1 ప్రతి ఒక్కరూ 3 సెట్ ల ఫారం 16 లను MEO ఆఫీసుకి సబ్మిట్ చేయాలి.


2 మీరు సబ్మిట్ చేసే 3 సెట్లలో 2 సెట్ కి.... మీరు టాక్స్ మినహాయింపుకై జతపరచబోయే అన్ని రకాల సేవింగ్స్ యొక్క రిసిప్ట్స్ ని మాత్రమే జతపరచాలి (జీతం ద్వారా మినహాయింపు జరుగుతున్న మినహాయిపులకు రిసిప్ట్స్ అవకాశం లేదు)


3 మీరు జతపరిచే రసీదులు తేదీ 01.04.2023 నుండి 31.03.2024 మధ్య కట్టినవి మాత్రమే అయి ఉండాలి.


4 ఉద్యోగి తన పేరు మీద కట్టిన సేవింగ్స్ కి మినహా తన తల్లిదండ్రుల/భాగస్వామి/పిల్లల పేరు మీద కట్టి , ఆ రసీదులపై టాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేయదలిచే వారు .. ఆ రసీదులో ఉన్న వారితో మీ బంధుత్వం తెలియజేస్తూ వారు పూర్తిగా మీ పోషణలోనే ఉన్నారని డిక్లరేషన్ ని మీరు MEO ఆఫీసు కి పంపే 3 సెట్స్ ఫారం 16 లకు జత చేయగలరు.


5 పై నుదహరించిన ఎవరి పేరు మీద ప్రతినెల/క్వార్టర్లీ/హాఫ్ ఇయర్లీ/ఇయర్లీ కట్టే ప్రీమియం ల యొక్క రసీదులకు బదులు yearly provisional certificate ని జతచేసే ప్రయత్నం చేయగలరు.(అలా చేస్తే మీ ఫారం 16 పరిశీలన సులభతరం అవుతుంది )


6 మీరు టాక్స్ మినహాయింపు కై జత చేసే ఏ విధమైన లోన్స్ యొక్క statements కూడా పరుగణింపబడవు. లోన్స్ విషయంలో ఖచ్చితంగా సదరు సంస్థ నుండి తీసుకున్న 2023-24 ఇయర్లీ ప్రొవిజినల్ లోన్ సర్టిఫికేట్ మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.(ఒరిజినల్ సర్టిఫికేట్ ని మాత్రమే సమర్పించాలి. జిరాక్స్ కాపీలు పరిగణించబడవు)



7 మీరు కట్టే మీ పిల్లల ట్యూషన్ ఫీజ్ పై మాత్రమే టాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.కనుక మీరు మీ ఫారం 16 నింపేటప్పుడు ట్యూషన్ ఫీజ్ ని మాత్రమే టాక్స్ మధింపుకి పరిగణనలోకి తీసుకుని మదింపు చేయగలరు. అదే విధంగా ఆ ట్యూషన్ ఫీజ్ రసీదులపై టాక్స్ మినహాయింపు పొందగోరే వ్యక్తి యొక్క పేరు మెన్షన్ చేయించి రసీదు తీసుకోగలరు. అలా మీ పేరు మెన్షన్ చేయని పక్షంలో ట్యూషన్ ఫీజ్ మినహాయింపు కి కూడా SELF DECLARATION ఇవ్వగలరు.


8 మీరు MEO ఆఫీసు కి పంపే 3సెట్స్ ఫారం 16 ల పై విధిగా DDO పేరు, హోదా, DDO TAN NUMBER, DDO PAN NUMBER వేయగలరు.


9 మీరు MEO ఆఫీసు కి సబ్మిట్ చేసే 3 సెట్స్ ఫారం 16 లకు కూడా మీ యొక్క PAN CARD జిరాక్స్ విధిగా జత చేయగలరు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page