top of page

Pension Rules :


పెన్షనర్ ఒకవేళ మరణిస్తే ఆతని కుటుంబానికి ఆ పెన్షన్ లభిస్తుంది. అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుందనే విషయంలో స్పష్టమైన నిబంధనలున్నాయి.


🔹మరణించిన పెన్షనర్ భార్యకే లభిస్తుందా లేక కుమారుడు లేక కుమార్తెకు కూడా లభించే అవకాశముందే.. అసలు రూల్స్ ఏం చెబుతున్నాయనేది పరిశీలిద్దాం..


1. మృతుడి భార్యకు పెన్షన్ లబిస్తుంది.

2. 25 ఏళ్లలోపు వయస్సు కలిగిన పెళ్లి కాని కుమారుడు లేదా పెళ్లైన లేక విధవ లేక డైవర్సీ అమ్మాయి ఆ తండ్రిపై ఆధారపడి ఉంటే ఆమెకు లభిస్తుంది.

3. సంపాదించలేని వికలాంగ బిడ్డలకు కూడా వర్తిస్తుంది. వయస్సు, వివాహం షరతులు వర్తించవు

4. మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకు

5. మృతుడిపై ఆధారపడే సోదరులు లేదా సోదరీమణులకు


🌹పెన్షన్ ఎంతకాలం లభిస్తుంది

1. మృతుడి భార్యకైతే జీవితాంతం

2. పెళ్లికాని 25 లోపు కుమారుడు లేదా విధవ, డైవర్సీ కుమార్తె అయితే సంపాదన వచ్చేవరకూ లేదా మరణించేంతవరకూ

3. వికలాంగ బిడ్డలకు కూడా మరణించేవరకూ

4. మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకు జీవితాంతం


👩కూతురు విషయంలో రూల్స్ ఇలా

పెన్షన్ విషయంలో పెళ్లైన కుమార్తెకు వర్తిస్తుందా లేదా అనే అంశంపై చాలా సందేహాలున్నాయి. పెళ్లైన కుమార్తె తండ్రి పెన్షన్‌ను క్లెయిమ్ చేసుకోగలదా లేదా అనేదే అసలు ప్రశ్న. ఆ పెన్షన్ వ్యవధి ఎంతకాలముంటుంది. రూల్స్ ప్రకారం కుమార్తెకు పెళ్లైనంతవరకూ పెన్షన్ పొందవచ్చు. అదే కుమార్తె విడో లేక డైవర్సీ అయితే ఆమె రెండో వివాహం చేసుకునేవరకూ లేక ఉద్యోగం లభించేవరకూ పెన్షన్ లభిస్తుంది.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page