top of page

🇮🇳🇮🇳🇮🇳 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳

🇮🇳🇮🇳🇮🇳75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳

రాజ్యాంగమే మన జాతీయ గ్రంథం


మనది లౌకిక రాజ్యం.మతం వ్యక్తిగత అంశం అని మన రాజ్యాంగం చెప్తుంది.అందుకే రాజ్యాంగమే మన జాతీయ గ్రంథం అవుతుంది.ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్దించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్నిరూపొందించేందుకు  1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు.


రాజ్యాంగ ముసాయిదాను  రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘’భారత గణతంత్ర’’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్ర్యం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.


రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి,పరిష్కరించింది.భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటుగామారింది.1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.


 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగాజరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చకోసంపోరాడడానికి నిర్ణయించుకున్నారు.రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి.ప్రతి భారతీయుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.రాజ్యాంగాన్ని గౌరవించాలి.రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యంగ పిత డా. బి.అర్.అంబేద్కర్ ను తప్పకుండా స్మరించుకోవాలి.


75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

8 views

Comentários


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page