top of page

క్రీమిలేయర్ కీలక సమాచారం.new guidelines

క్రీమిలేయర్ కీలక సమాచారం

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్ నెంబర్ ఈ/424/2014 తేదీ 28.0 7.2014

 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు, వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.


క్రిమిలేయర్ వర్తించేవారు:


1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు.


2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు.


3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కాబడి గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.


సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.

              

     కానీ కొంత మంది సిబ్బందికి క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిందని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు.


148 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page