AP Edn Inspecting Officers Schools Visit Proforma 2023.
విద్యా శాఖా అధికారులు పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించి, నమోదు చేసే అంశాలు.
ఉపాధ్యాయులపై తనిఖీల ఒత్తిడి
పాఠశాలల్లో 27 అంశాలను పరిశీలించాలంటూ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు
హడావుడిగా ప్రత్యేక డ్రైవ్..
ప్రభుత్వ బడుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అధికారులు అభ్యసన మెరుగు కార్యక్రమం(లిప్)ను తీసుకొచ్చారు. ప్రథమ్ సంస్థ అధ్వ ర్యంలో బేస్ లైన్ పరీక్ష నిర్వహించి, విద్యార్థుల సామర్థా ్యలను గుర్తించారు. వీరి కోసం డిసెంబరులో ప్రత్యేక పుస్తకాలను అందించారు. ఆ తర్వాత దీని అమలును మూలకు పడేశారు. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన 'సమీక్షలో లిప్ చర్చకు రావడంతో ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తు న్నారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కడప, అన్న మయ్య, అనంతరం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ కార్యక్ర -మాన్ని అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు డిసెంబరులో రెండు పరీక్షలు, జనవరిలో ఒక పరీక్ష నిర్వహించాలని ఒక్కో విద్యార్థికి సంబంధించిన ప్రత్యేక కేస్ స్టడీలను రూపొందించాలని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. జనవరి నెలలో 3 నుంచి 10 వరకు సమ్మె. టివ్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 19 వరకు సెలవులు ఇచ్చారు. పాఠశాలల పునఃప్రారంభమైన నాటి నుంచి సమ్మెటివ్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం, మార్కుల పోస్టింగ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్ష పెట్టే అవకాశమే లభించలేదు. ఇప్పుడు 25 లోపు పరీక్ష పూర్తి చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. మొదట ప్రకటించిన అకడమిక్ కేలండర్ ప్రకారం డిసెంబరులోనే సమ్మెటివ్ పెట్టాలి. కానీ, పరీక్షను వెనక్కి జరిపి, ఇప్పుడు ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడూ 10మందిని దత్తత చేసుకొని, వారి అభ్యసన స్థాయిలపై ప్రత్యేక కేస్ స్టడీ నిర్వహించాలని ఆదేశిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేదాన్ని బట్టి ఉపాధ్యాయులకు ర్యాంకులు ఇస్తామని పేర్కొంటున్నారు. గుడ్. పూర్, వెరీ పూర్తిగా ర్యాంకులు ఇచ్చి, వెరీ పూర్తిగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటా మని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఈ జిల్లా లోని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.