top of page

AP employees నూతన DA ( 5.24 % ) ఆర్థిక శాఖ ఉత్తర్వులు -మీ ఎరియర్స్ ఎంత ?. పూర్తి వివరాలు.

నూతన DA ( 5.24 % ) ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది .


మీ పేరుతో కొత్త DA ఏరియర్స్ వర్కషీట్ ను క్రింది web page లో తయారుచేసుకోవచ్చు .


DA Arrears Calculator July 2019 ( 38.776 %)


మీ పేరు , ఇప్పటి బేసిక్ , ఎంటర్ చేస్తే చాలు 3 installments లలో ఎంతెంత ఏరియర్స్ రావాలో నెలవారీ వర్కషీట్ తయారు అయిపోతుంది .



D.A ARREARS FROM JULY 2019 TO DECEMBER 2021

DA Go 99 dt 20/12/2021 rlsd


DA enhanced from 1/7/2019


DA enhanced from 33.536% to 38.776% (5.24%)


Cash from Jan/2022


Arrears from 1/7/2019 to 31/12/2021 adjusted to PF in three equal installments from Jan/2022(For CPS employees paid in cash in 3 installments)


Who retired/retire from 1/7/2019 to 30/6/2022 shall be paid in cash DA arrears from 1/7/2019 to 31/12/2021 (30 months) adjusted to PF in 3 installments months:


1st installment 1/7/2019 to 4/2020(10 months)


2nd installment: from 5/2020 to 2/2021 (10months)


3rd installment from 3/2021 to 12/2021(10months)





నూతన DA ( 5.24 % ) ఉత్తర్వుల సారాంశం.


జనవరి -2022 నెల జీతాలతో అనగా ఫిబ్రవరి 1 వ తేదీన తీసుకునే జీతాల నుంచి పెరిగిన DA ( 5.24 % ) చెల్లించు విధముగా ఆదేశాలు జారీ .


PF ఉద్యోగులకు : 01 - జూలై -2019 నుంచి 31 డిసెంబర్ -2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు జనవరి - 2022 నుండి 3 సమాన వాయిదాలలో ZPP అకౌంట్ కు జమకాబడును .


CPS ఉద్యోగులకు : 01 - జూలై -2019 నుంచి 31 డిసెంబర్ -2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు ( 90 % ) జనవరి 2022 నుండి 3 సమాన వాయిదాలలో చెల్లించబడును . మిగిలిన 10 % PRAN ఖాతాకు జమకాబడును .


పదవీవిరమణ ఉద్యోగులకు : 01 - జూలై - 2019 నుంచి 30-జూన్-2022 మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఎరియర్స్ నగదు ZPPF ఖాతా కు జమ కాకుండా, నగదు రూపంలో చెల్లించ బడును.


2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు కరువు భత్యం బకాయిలను 2022 ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల ZPPF కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు .


పెరిగిన కరువు భత్యాన్ని 2022 ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1 వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు . అలాగే , సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏ ని 2022 ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1 వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు


CPS ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను ఈ ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . ఎవరెవరికి వర్తిస్తుందంటే .. ” పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్ , మండల పరిషత్ , గ్రామ పంచాయతీ , జిల్లా గ్రంధాలయాల సమితి , రెగ్యులర్ స్కేల్స్లో పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్ మెంట్ ఉద్యోగులకు వర్తించనుంది . అంతేకాక .. రెగ్యులర్ పే స్కేల్స్లో పనిచేస్తున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్ , ఎయిడెడ్ పాలిటెక్నిక్ పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తిస్తుంది . విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ .. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ , డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్ పే స్కేల్స్లో టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది . వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .




మీ BASIC PAY ENTER చేసి మీకు వచ్చే DA ఎరియర్స్ తెలుసుకోవచ్చు ⬇️



33 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page