CFMS ID తో మీ జీతం వివరాలు తెలుసుకోవడం ఎలా?
- APTEACHERS
- Feb 7, 2021
- 1 min read
Updated: Aug 23, 2021
CFMS ID తో మీ జీతం వివరాలు తెలుసుకోవడం ఎలా?
ప్రతి నెలా జీతాన్ని ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
_మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో_ Benificiary entry mode అని కనిపిస్తుంది. దాని దగ్గర క్లిక్ చేయగానే అక్కడ manual entry ని select చేసుకోవాలి.
అలా enter చేసిన వెంటనే కింద మనకు Benificiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి
తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి
ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Nett కనిపిస్తుంది. మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.
ఇంకేముంది ఇలా ప్రతీ నెలదీ చూసుకుని వ్రాసుకుంటే Income tax easy. ఇంకా మీరు ఒక డైరీలో కూడా వ్రాసుకుని పెట్టుకుంటే మరీ మంచిది.