top of page
Writer's pictureAPTEACHERS

e-filing రూపకల్పనలో ఎదురయ్యే సమస్యలు-పరిష్కరం

*e-filing రూపకల్పనలో ఎదురయ్యే సమస్యలు-పరిష్కరం*


*మరో 15 రోజులలో ముగియనున్న e-filing గడువు*


*ఆర్థిక సంవత్సరం 2018-19 INCOME టాక్స్ చెల్లింపుదారులు e-filing ద్వారా వారి వారి మొత్తం ఆదాయం , సేవింగ్స్ , డిడక్షన్స్, నికర ఆదాయం వివరాలు Minstry of Finance భారత ప్రభుత్వం వారికి ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా తేదీ 31/07/2019 తో ముగియనున్నది.*


*కావున గడువుకు కనీసం ఒక పది రోజుల ముందే e-filing పూర్తి చేసుకునే వీలు కల్పించుకోగలరు.*


*ఎందుకంటే....*


*దిగువన తెలుపబడిన సమస్యలు/పొరపాట్లు e-filing చేస్తున్నప్పుడు ఎదురైతే,ఆ సమస్యలను/పొరపాట్లను సవరించి సులువైన మార్గంలో e-filing పూర్తి చేసుకునే వెసులుబాటును ప్రతి సంవత్సరం పొందేలా మీ మీ e-filing అకౌంట్స్ ను రూపుధ్ధికోవచ్చు.*


*e-filing లో ఎదురయ్యే సమస్యలు-పరిష్కరం*


*సమస్య 1*


1. *టాక్స్ ను మీరు మీ DDO ద్వారా/బ్యాంక్ ద్వారా/efiling ఫోర్టల్ ద్వారా చెల్లించినప్పుడు మీ e-filing అకౌంట్ నందు ఫారం నెంబర్ 26AS నందు మీరు కట్టిన పూర్తి టాక్స్ విలువలు ఉండాలి.లేనిచో మీ టాక్స్ చెల్లింపులో పొరపాటు జరిగింది అని గ్రహించగలరు.*


*పరిష్కరం1*


1. *టాక్స్ చెలింపు DDO ద్వారా జరిగి , 26AS లో టాక్స్ విలువలు లేకపోతే మీ PAN నెంబర్ TDS కాలేదని గ్రహించాలి.దినికై మరల TDS ను REVISE చేసి మీ PAN నెంబర్ ను TDS చేయించాలి.చేసిన వారం లోగా ఫారం నెంబర్ 26AS లో మీ టాక్స్ జమ జరిగింది లేనిది చూసుకొని e-filing చేసుకోవాలి.26AS లో TAX వివరాలు లేకపోవడానికి కారణం మీ DDO TDS చేయజ పోవడం కానీ, చేస్తే PAN నెంబర్ తప్పుగా నమోదుకావడం కానీ ఉండును.కావున ఇప్పటికీ ఇంకా ఎవరైనా DDO లు TDS చెయ్యకపోతే వెంటనే TDS చేసుకోవాలి.లేనిచో DDO పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బందికి గురి అవుదురు. గమనించగలరు.*


*బ్యాంక్ ద్వారా టాక్స్ చెల్లింపు చేసిన సందర్భంలో టాక్స్ వివరాలు 26AS లో లేకపోతే ఒక నిర్ణిత గడువు లోగా బ్యాంక్ వారికి REVISE చేసే అవకాశం ఉండును*


*e-ఫైలింగ్ ఫోర్టల్ ద్వారా చెల్లింపు చేసిన సందర్భంలో టాక్స్ వివరాలు 26AS లో నమోదు కాకపోతే మీ మీ INCOME TAX వార్డ్ పరిధి లోని AO ను నిర్ణత పరిదిలోగా REVISE కు విన్నవించుకోవాలి.*


*సమస్య 2*


*మీ యొక్క ఆధార్ PAN లింక్ లేకపోవడం.దీనికి కారణం మీ PAN కార్డ్ వివరాలు ఆధార్ కార్డ్ వివరాలు వేరే వేరుగా ఉండడం.*


*పరిష్కరం2*


*ప్రభుత్వ సంస్థల అధీనంలో పనిచేస్తున్న మీ సేవ కేంద్రాలకు ORGINAL PAN కార్డ్ తీసుకెళ్లి మీ సేవ ద్వారా PAN కార్డ్ వివరాల ప్రకారం ఆధార్ వివరాలు మార్చుకోవచ్చు.*


*PAN కార్డ్ వివరాలు ఆధార్ ప్రకారం మార్చుకోవలంటే PAN కార్డ్ రూపొందించే వారి ద్వారా కానీ/ ఏదేని మీ సేవ ద్వారా కానీ మార్చుకోవచ్చు.మార్చుకునే ముందు ఒక సరి PAN, ఆధార్ వివరాలు పోల్చి, సరిచేసుకోవాలి.PAN ఆధార్ వివరాలు ఒకే విదంగా ఉండి PAN ఆధార్ లింక్ లేకపోతె వెంటనే PAN ఆధార్ లింక్ చెయ్యవచ్చు. లేనిచో రెండింటి వివరాలు ఒకే విదంగా మార్చిన తారువతే వీలై e-ఫైలింగ్ e-వెరిఫికేషన్ కు వీలగును.భవిష్యత్ లో e- ఫైలింగ్ చేసుకునే వీలుండును. గమనించగలరు.*


*సమస్య3*


*PAN ఆధార్ లింక్ ఉన్న e-verification కాకపోవడం.దీనికి కారణం ఆధార్ నెంబర్ కు ప్రస్తుతం మీ వద్ద ఉన్న మొబైల్ నెంబర్ కు లింక్ లేక పోవడం.*


*పరిష్కరం3*


*ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న మీ కేంద్రాల ద్వారా ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ కు లింక్ చెయ్యడం.*


*సమస్య 4*


*ఫారం నెంబర్ 16 లోని ఆదాయం కంటే ఆదాయం పెరిగిన సందర్భంలో కానీ, అడ్వాన్స్ టాక్స్ సరిగా చెల్లించని సందర్భంలో కానీ టాక్స్ రూపంలో కానీ ,interst రూపంలో కానీ టాక్స్ పెరుగును.దీనికి కారణం ఆదాయం ఇతర మార్గాల ద్వారా పొంది ఉండడం/అడ్వాన్స్ టాక్స్ చెల్లించవలసినంత చెల్లించక పోవడం.*


*పరిష్కరం 4*


*E-filing ఫోర్టల్ ద్వారా ప్రస్తుతము చెల్లించవలసిన ఆదనపు టాక్స్ ను మీ మీ/ఇతరుల ATM CARD ను వినియోగించిగాని,NET బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలి.*


*పైన తెలిపిన సమస్యలు లేకుండా e-ఫైలింగ్ చేసుకోగలరు.వుంటే పరిష్కరించుకొని సౌకర్యవంతంగా e-ఫైలింగ్ రూపొందించుకోగలరు.*

5 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page