top of page

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు

Updated: Oct 20, 2021

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు 👉ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 👉ప్రాథమిక పాఠశాల విషయంలో 21వ తేదీ తెలుగు 22వ తేదీ ఆంగ్లము, 23వ తేదీ గణితం, 25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి. 👉సెకండరీ పాఠశాల విషయంలో 21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం, 22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 ,7 తరగతులకు సైన్స్ 8, 9 ,10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి


👉ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . 👉మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి. తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి . 👉ఆ తర్వాత మార్కులను నమోదు చేసి ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి. 👉కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక బోధన నిర్వహించవలసి రావచ్చు. Download proceedings

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page