JVK కిట్లు పంపిణీ కొరకు పాఠశాల విద్యాశాఖ- తాజా మార్గదర్శకాలు
పాఠశాల విద్యాశాఖ-'జగనన్న విద్యా కానుక ' 2021-22-స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు ' మన బడి : నాడు - నేడు' - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తాజా మార్గదర్శకాలు.
జగనన్న విద్యాకానుక
Highlights
★ జగనన్న విద్యాకానుక ' స్టూడెంట్ కిట్లును 16.08.2021 నుండి 31.08.2021 లోపు పంపిణీ చేయాలి. మొదట వచ్చిన విద్యార్థికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి.
★ రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
★ ఒక రోజులో గరిష్టంగా 30 - 40 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలి.
★ ప్రతి పాఠశాల నందు ' స్టూడెంట్ కిట్ ' సిద్ధం చేసి విద్యార్థులకు అందించేందుకు సన్నద్ధులై ఉండాలి. ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో ' అనుబంధం - 1'లో పొందుపరచడమైనది.
★ తరగతి వారీగా బాలబాలికలకు విడివిడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి. సులభంగా, త్వరితగతిన సంబంధిత విద్యార్థికి కిట్ అందించడానికి ప్రతి బ్యాగు మీద ఉన్న పౌచ్ లో దిగువ తెలిపినట్లు పేపర్ పెట్టుకోవాలి.
★ నమూనా ఇలా...