top of page

Learn a Word a day proceedings ఆగష్టు మాసానికి తాజా షెడ్యూలు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Learn a Word a day

ఆగష్టు మాసానికి తాజా షెడ్యూలు( స్థాయిల వారీగా పదాల జాబితా) విడుదల:


1 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల భాష పదజాలం పై పట్టు సాధించడానికి అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమం "రోజుకో పదం నేర్చుకో".


👉ఇందులో భాగంగా ఆగస్టు నెల కు 1 నుండి 31 వ తారీఖు వరకు 22 రోజుల పాటు వివిధ స్థాయిల ( లెవెల్ 1 నుండి 4 వరకు) విద్యార్థులకు నేర్పించాల్సిన పదాల జాబితా తో కూడిన షెడ్యూలు విడుదలైనది.


కార్యక్రమ అమలు తీరు:


👉ప్రతి రోజు

షెడ్యూలు అనుసరించి ఒక ఆంగ్ల పదాన్ని పాఠ శాల అసెంబ్లీ లో పరిచయం చేయాలి.


👉మొదటి పీరియడ్ ఉపాధ్యాయుడు ఆ పదాన్ని, దాని అర్థాన్ని బోర్డ్ పై మూలలో వ్రాసి పిల్లలచేత పలికించాలి.


👉ఆంగ్ల ఉపాధ్యాయుడు

తన పీరియడ్ నందు ఆ పదము యొక్క అర్థమును (రెండు భాషలలోను),పలుకు విధానమును,స్పెల్లింగ్,దాని భాషాభాగాలు( parts of speech), దాని యూసేజ్ ను వివరించాలి.విద్యార్థులచే డిక్షనరీలో ఆ పదాన్ని పెన్సిల్తో underline చేయించాలి.


👉విద్యార్థులు ఒక 100 పేజీల నోటు పుస్తకంలో పదం యొక్క వివరాలు రాసుకోవాలి. దీనిని "My Own Dictionary" గా పిలుస్తారు.దీనిని ఉపాధ్యాయుడు తప్పకుండా తరచుగా చెక్ చేయాలి.


👉మిగిలిన పీరియడ్ల ఉపాధ్యాయులు కూడా పీరియడ్ ప్రారంభం లో 5 నిమిషాలు పదమును,అర్థమును పలికించాలి.


👉Learn a word a day programme నిర్వహణ ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత.


👉ప్రతి ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో వీలైనన్ని సార్లు , వీలైనన్ని సందర్భాలలో ఆ రోజుటి పదాన్ని ఉపయోగించాలి.


👉ప్రతి రోజూ, ఆ రోజు పదాన్ని పాఠ శాల వరండాలో, అసెంబ్లీలో బోర్డుపై ప్రదర్శించాలి.


👉ప్రతి 15 రోజులకు ఒక సారి అంతవరకు ఆ 15 రోజులలో నేర్చుకున్న పదాలపై Spell bee కాంపిటీషన్స్ నిర్వహించాలి.


👉తనిఖీ అధికారులు వచ్చినపుడు విద్యార్థుల నోటు పుస్తకాలు( పదాలు రాసుకున్నవి), డిక్షనరీ ఎంట్రీస్ తప్పక చూపాలి.




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page