NEP Merging of Schools : 3 కి.మీ ల లోపు స్కూల్స్ విలీనానికి మొదలైన ప్రక్రియ-సూచనలు జారీ.
NEP - Special Drive of Schools Verification on 06.01.2022
గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము డిసెంబర్ 2021 న ప్రతి హై స్కూల్ Login లో వారికి 0 km నుండి 3 KM లోపు ఉన్న పాఠశాల వివరాలు online లో నమోదు చేయించుట జరిగింది .
గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారము ప్రదానోపాధ్యాయులు నమోదు చేసిన వివరాలను ప్రతి మండలం లో Mandal Level Committee లను నియమించి ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి ఈ క్రింది వివరాలు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసిఉన్నారు .
కావున జిల్లాలోని MEO లు అందరూ మీ మండలంలో Mandal Level Committee లను ( కమిటీ లో MEO ( 01 ) , Mapped High School Headmaster అందరూ ) నియమించి , ది : 06.01.2022 న ఈ క్రింది వివరాలు ప్రతి పాఠశాలను ప్రత్యక్షముగా తనిఖీ చేయించి వాటి వివరాలను మీకు mail చేసిన Excel Sheet లో నమోదు చేసి Soft Copy ని తేది : 06.01.2022 సాయంత్రం 6.00 గంటలు లోపు mail చేయవలెను మరియు Hard Copy పై Mandal Level Committee అందరితో సంతకాలు పెట్టి DEO కార్యాలయానికి 07.01.20 ఉదయం 11.00 గంటలు లోపు పంపవలెను .
తనిఖీ చేయవలసిన అంశాలు :
1 . HS కి కలపబడిన PS యొక్క ఖచ్చితమైన దూరం KM లో ఎంత ?
2 HS కి కలపబడిన PS నుండి విద్యార్ధులను HS కి పంపుటకు ఏవిధమైన ఇబ్బందులు ఉన్నాయా ? " If Yes , ఒకవేళ ఇబ్బంది ఉంటే ఈ క్రింది కారణాలు మాత్రమే ఉండాలి .
a . బైపాస్ రోడ్ దాటవలెను .
b . కాలువలు దాటువలెను .
c . రైల్వే గేట్ దాటవలెను .
d . PS విద్యార్ధులు HS కు వెళ్ళటానికి అవకాశం లేని కారణం వ్రాయాలి .
e. ఈ PS ను map చేసిన HS కన్నా మరియొక్క HS దగ్గర .
3. ప్రస్తుతం HS లో ఉన్న తరగతి గదులు ఎన్ని ?
4. HS కు 1 km పరిధిలో ఉన్న అన్ని PS లను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం ( ACRs ) .
5. HS కు 2 km పరిధిలో ఉన్న అన్ని PS లను కలిపిన ఇంకా HS కు ఎన్ని తరగతి గదులు అవసరం( ACRs )
6 . HS కు 3 km పరిధిలో ఉన్న అన్ని PS లను కలిపిన ఇంకా HS కు ఎన్ని అదనపు తరగతి గదులు అవసరం ( ACRs ) .