top of page
Writer's pictureAPTEACHERS

SMF అకౌంటెంట్స్ ఓపెన్ చేసి STMS లో సదరు అకౌంటెంట్స్ ను రిజిస్టర్ చేసాక ఏమి చేయవలె..?

SMF అకౌంటెంట్స్ ఓపెన్ చేసి STMS లో సదరు అకౌంటెంట్స్ ను రిజిస్టర్ చేసాక ఏమి చేయవలె..?


✅ ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో రిజిస్ట్రేషన్ విభాగం లో Capture details of cheque sign members ఆప్షన్ లోకి వెళ్ళి SDC కమిటీ 3గ్గురు సభ్యుల వివరాలు అప్లోడ్ చేయాలి.


SMF గ్రాంట్లను ఎలా పనులకు ఉపయోగించాలి...?


➡️ ఈ SMF గ్రాంటును 3 రకాలుగా ఉపయోగించాలి.

1) నాడు-నేడు లో చేపట్టిన అన్ని ఆస్తులకు(Assets) మరమ్మతులు

2) పూచీకత్తు (వారంటీ) లేని వస్తువులు పాడైపోతే సదరు వస్తువులను మార్చట

3) ఆగిపోయిన పనులను పునరుద్ధరణ ( Restoration) చేయుట.


👉 మరి పైన తెలిపిన 3 రకాలైన పనులు చేయాలంటే అనగా ఏరకమైన రిపైర్లు చేయాలో ముందుగా గుర్తించాలి.


🔊 ఎవరు గుర్తించాలి..?


✅ పాఠశాల 🧑🏻‍🏫ప్రధానోపాధ్యాయులు, SMF అకౌంటెంట్ కి ఏ ఇద్దరు 👬పేరెంట్ కమిటీ సభ్యులు పేర్లు ఇచ్చారో వారు.. ఈ👨‍👦‍👦 ముగ్గురు కలిసి పాఠశాలంతా పూర్తి గా క్షుణ్ణంగా పరిశీలించి పాఠశాల అవసరాలను మరియు పాఠశాలకు తక్షణమే సమకూర్చవలసిన నిర్వహణా సామగ్రిని గుర్తించాలి.


✅ చేపట్టవలసిన పనులకు సంబంధించి సంబంధించిన 📷 ఫొటోలు తీసుకుని వుంచవలె.


🔴 పనులు గుర్తించిన తర్వాత ఏమి చేయాలి..?


✅ ఆ పనులకు ఎంత మొత్తం💰 అవసరమవుతుందో 👨‍💻 అంచనా(ఎస్టిమేషన్స్) తయారు చేయాలి


👩‍💻 అంచనాలు ఎవరు తయారు చేయాలి..??


✅ అంచనాలను 👷‍♂️సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ తయారు ఘచేయాలి.

✅ చేసాక ఆ అంచనాలకు సదరు పాఠశాల అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ 📜తీర్మానం చేయాలి


✅ 📜 తీర్మానం చేసిన తదుపరి సదరు తీర్మానముపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు పిసి సభ్యులు మరియు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ సంతకాలు చేసి సదరు 📜తీర్మానాన్ని, STMS APP 🖥️ లో అప్లోడ్ చేయవలె.


✅ ఈ తీర్మానాన్ని 🗂️అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ గా పరిగణిస్తారు..

✅ ఒకసారి పాఠశాల అభివృద్ధి కమిటీ పాఠశాలకు చేయవలసిన రిపైర్లను గుర్తించిన తర్వాత మరియు అంచనాలు తయారుచేసిన తర్వాత సదరు అంచనాలను సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన 📱మొబైల్ ఆప్ లో అప్లోడ్ చేయవలె.


🚫 ఇక్కడ గుర్తు పెట్టుకోవవసిన ముఖ్యవిషయం


👉 అంచనాలను ప్రధానోపాధ్యాయులు 📱మొమొబైల్ ఆప్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సదరు పనులకు సంబంధించిన కాంపోనెంట్స్ వారీ ఫొటోలనుకూడా

అప్లోడ్ చేయవలె.


👉 ఈ అంచనాలను తయారుచేయడాని నిర్దేశించిన ఫార్మేట్ లో పొందుపరిచి అప్లోడ్ చేయవలె


👉 ఫార్మేట్ (ఎక్సల్లో 5 అడ్డు కోలమ్స్ లో పెట్టాలి)

__ __ __ __ __



NAME OF THE COMPONENT


TYPE OF REPAIRS


ESTIMATED AMOUNT


PHOTO TO BE UPLOADED


ఈ రకంగా ఎక్సల్ ఫార్మేట్ లో వేసి ప్రధానోపాధ్యాయులు STMS లో తన లాగిన్లో అప్లోడ్ చేయాలి.

⬇️

ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో అప్లోడ్ చేసిన అంచనాలు తదుపరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లోకి వెళతాయి. ఇప్పుడు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల్ సదరు అడ్మిన్ సాంక్షన్ కు అప్రూవల్ ఇచ్చిన తర్వాత

ఎమ్ ఇ ఒ లాగిన్ కి తదుపరి ఎపిసి లాగిన్ కి వెళతాయి. ఎపిసి లాగిన్ లో అప్రూవల్ అయ్యాక ఎఫ్ ఎ ఒ లాగిన్లలో FTO జనరేట్ అయ్యాక ఎపిసి గారు సదరు ఎస్టిమేషన్ ను CFMS కి పంపుతారు. తదుపరి CFMS నుంచి నిధులు SMF అకౌంటెంట్స్ కి చేరుతాయి.


✅ నిధులు SMF అకౌంటెంట్స్ లో జమైన వెంటనే SDC వారు పనులను ప్రారంభించాలి.

✅ సిమ్మెంటు, ఇసుక, ఇటుక, టైల్స్, పైపులు,మొదలగు నిర్మాణ సామగ్రి ధరలు మరియు మేస్త్రి, ప్లంబర్, కార్పంటర్ చార్జీలు SDC వారు పనులు ప్రారంభానికి ముందుగా నిర్ణయించుకోవాలి.

✅ ఏ పనికి లేదా వ్యక్తులకు ముందస్తు అడ్వాన్స్ ఇవ్వకూడదు

✅ ప్రతీ బిల్లుకు ఓచరు రాసి వాటి మీద SDC(SMF) కమిటీ వారు ముగ్గురూ సంతకాలు చేయాలి. సదరు బిల్లులను మరియు ఓచర్లను ప్రధానోపాధ్యాయులు తమ SMF లాగిన్ నుంచి అప్లోడ్ చేయాలి.


సేకరణ


మెమో నెంబరు 1840006/prog. II/A2/2022..Dated: 02/11/2022



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page