top of page

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర కరవు భత్యాన్ని పెంచుతూఆర్థిక శాఖ ఆదేశాలు జారీ

ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డి ఏ పెంపు


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు

3.144 శాతం మేర కరవు భత్యాన్ని పెంచుతూ

ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ

ముఖ్య కార్యదర్శి రావత్ శనివారం రాత్రి ఈ

ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా

ఉన్నాయి.


మూలవేతనంపై 30.392 శాతం నుంచి

33.536 శాతానికి డీఏ పెంపు.


2019 జనవరి 1 తేదీ నుంచి కరవు భత్యం

పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.


ప్రభుత్వ ఉద్యోగులు,

జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయితీలు, పాఠశాలలు,

విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు,

అధ్యాపకేతర సిబ్బందికీ డీఏ పెంపుదల

ఉంటుంది.


ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని అద్యాపకులు,

అధ్యాపకేతర సిబ్బంది, జ్యూడీషియల్ ఆఫీసర్లకు

148 నుంచి 154 శాతం మేర డీఏను

పెంపుదల చేసినట్టు పేర్కొన్న ఉత్తర్వులు.


2021 జూలై నెల వేతనంతో పెంచిన కరవు

భత్యాన్ని నగదు రూపంలో చెల్లించనున్నట్టు

స్పష్టం చేసిన ప్రభుత్వం .


2019 జనవరి 1 తేదీ నుంచి డీఎ బకాయిలను

ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలకు జమ

చేయనున్నారు.


సిపిఎస్ ఉద్యోగులకు ఆరియర్స్ మూడు విడతలుగా చెల్లించనున్నారు.




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page