top of page

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికి ప్రవేశం నోటిఫికేషన్.

Updated: Aug 23, 2021

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోనికి ప్రవేశం కొరకు ప్రకటన.

--------------

తేది : 15.04.2021


ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు )లో 2021 - 22 విద్యా సంవత్సరంనకు 6వ తరగతిలో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లం లో ఉంటుంది.


ప్రవేశ అర్హతలు :

-------------

వయస్సు : OC/BC కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2009 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.


SC/ST కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2007 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.


సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2019 - 20 మరియు 2020 - 21 విద్యా సంవత్సరంలు చదివి ఉండాలి.


★2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.


దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రం కొరకు www.cse.ap.gov.in

apms.ap.gov.in చూడగలరు.


✍️దరఖాస్తు చేయు విధానం :

----------

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది : 16.04.2021 నుండి 15.05.2021 వరకు...

net banking/Credit/Debit cards ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించడం జరుగుతుంది.


ఆ జనరల్ నెంబరు ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ కేంద్రంలో...


apms.ap.gov.in (online) లో దరఖాస్తు చేసుకోవాలి.


★దరఖాస్తు చేసుకోవడానికి రుసుము :


OC/BC రూ.100,

SC/ST రూ.50


★ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును.


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page