💥విశాఖపట్నం జిల్లా లోని అన్ని మండలాలలో ఆనందవేదిక కార్యక్రమం
▪విద్యార్థి స్వేచ్ఛగా ఎదిగేందుకు, భావోద్వేగ సమతుల్యంతో మెలిగేందుకు, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల మానసిక సన్నద్ధతతో ఉండేలా విద్యాశాఖ ఆనంద వేదిక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రతిరోజు పిల్లలందరిలో ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్యోద్దేశం. విద్య అంటే జీవితం గురించి నేర్చుకోవడమే. ఆటలంత ఆనందంగా, కథలంత కమనీయంగా, పాటలంత ఉత్సాహంగా, మాటలంత మనస్ఫూర్తిగా చదువు సాగేలా ఆనంద వేదిక ఆలంబన కానుంది.
💥ప్రతిరోజు అసెంబ్లీ పూర్తయిన తరువాత అరగంట సమయం ఆనంద వేదికకు కేటాయించాలి. మొదటి ఐదు నిమిషాలు మైండ్‌ఫుల్‌నెస్ కార్యక్రమం, తరువాత 20 నుంచి 22 నిమిషాలు ఆరోజు సూచించిన కార్యక్రమ నిర్వహణ, 2 లేదా 3 నిమిషాలు మౌన ప్రక్రియ చేపట్టాలి.
💥ఒక్కో ఉపాధ్యాయుడికి రెండు రోజులపాటు శిక్షణ ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల నుంచి ఆ పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే ఒకరితోపాటు ప్రధానోపాధ్యాయుడు కూడా శిక్షణలో పాల్గొనాలి. ఉన్నత పాఠశాలలో పది మందికన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే ఇద్దరు శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు శిక్షణలో కచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లిన తరువాత మిగిలిన ఉపాధ్యాయులు శిక్షణకు సంబంధించిన అంశాల్ని వివరించాల్సి ఉంటుంది.
💥సోమవారం విద్యార్థులకు ఒక సంఘటన, సన్నివేశాన్ని వివరించి ప్రతిస్పందనలు రాబట్టాలి.
💥మంగళవారం ఒక కృత్యాన్ని పరిచయం చేయాలి.
💥బుధవారం కృత్యాన్ని కొనసాగించి ప్రతిస్పందనలు రాబట్టాలి.
💥గురువారం ఒక టాస్క్ ఇచ్చి దాన్ని చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
💥శుక్రవారం టాస్క్ కొనసాగించి, ప్రతిస్పందనలు తెలుసుకోవాలి.
💥శనివారం భావవ్యక్తీకరణకు అవకాశం ఇవ్వాలి. ఈ అంశానికి సంబంధించి ఒక్కోవారం స్వీయ సంబంధ, కుటుంబ, సామాజిక, ప్రకృతి సంబంధ అంశాల్ని నిర్దేశించి విలువల వ్యాప్తికి కృషి చేయాలి.
●మైండ్‌ఫుల్‌నెస్ కార్యక్రమంలో ఒక సంఘటన చదివి వినిపించాలి. దీనిపై ప్రశ్నలు అడిగడం ద్వారా ప్రశ్నించడం నేర్పాలి. సంఘటనలో కీలక అంశాలను విద్యార్థులు గుర్తించే విధంగా చేయాలి. మండలంలో ఎంఈవో కోర్సు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. డీఈవో జిల్లా స్థాయిలో మానిటరింగ్ అధికారిగా, ఎస్‌ఎస్‌ఏ పీవో, ఏఎంవో కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కచ్చితంగా అమలు జరిగేటట్లు చూస్తారు.
●జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభూతులు సంతోషాన్ని ఇస్తాయి. కానీ అవి తాత్కాలిక ఆనందాలే. ఉదాహరణకు ఇష్టమైనవి తినటం, మంచి సువాసనలు పీల్చటం.
●భౌతిక వస్తురూపేణా పొందలేనివి, మానవ సంబంధ బాంధవ్యాల ద్వారా పరస్పర అనుభూతుల ద్వారా మానసికంగా అంతర్లీనంగా సంతోషాన్ని ఇచ్చేవి. ఉదాహరణకు ప్రేమ, ఆప్యాయత, పరిరక్షణ, కృతజ్ఞత, గౌరవం. ఇవి కుటుంబం, స్నేహితులు, సంఘంలో నుంచి వస్తాయి.
👉సంతోషమనేది నేర్పించేది కాదు, అనుభూతి చెందేది అనే విషయాన్ని తెలియజేయటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులకు అనుభూతుల ద్వారా సంతోష సూచికల్ని ఇచ్చే మార్గదర్శనమే ఆనందవేదిక.
▪విశాఖపట్నం జిల్లా లోని అన్ని మండలాలలో ఆనందవేదిక కార్యక్రమం అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం మండలం head quarters లో 14-10-2019 to 2-11-2019 వరకు జరుగును.
మండలాల వారీగా ఏ మండలము లో ఏ తేదీ లో శిక్షణ కార్యక్రమం జరుగుతుందో పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డవి.
Click Here To Primary school Shedule👇
https://drive.google.com/file/d/1vAbe__ouhx9hN1GBZVCHxiqCrgz2Tu4H/view?usp=drivesdk
Click Here To Upper Primary School Shedule 👇
https://drive.google.com/file/d/1vCjLbR7W1gQxU7zztemPJtcWx_OYmMol/view?usp=drivesdk
Click Here To High School Shedule 👇
https://drive.google.com/file/d/1vK2yNXhRNP6cjfpZ9PeXDCj_Zm5Y777W/view?usp=drivesdk
top of page
Search
bottom of page