top of page
Writer's pictureAPTEACHERS

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఉద్యోగుల సంఘాల (JAC) నాయకులతో భేటీ లో చేసిన తీర్మానాలు.

Updated: Aug 23, 2021


ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఉద్యోగుల సంఘాల (JAC) నాయకులతో భేటీ లో చేసిన తీర్మానాలు.


ఆరోగ్య శ్రీ ట్రస్ట్


✥ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14.10.2020న(నిన్న) సమావేశం నిర్వహణ. అన్నీ ఉద్యోగుల సంఘాల (JAC) నాయకులతో ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ డాక్టర్. మల్లికార్జున్ రావు, ఐ.ఏ. ఎస్ భేటీ.


తీర్మానాలు:


★ 1. EHS కు ప్రత్యెక ట్రోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయుట.


★ 2. Management Structure ను మార్పు చేయుట.


★ ౩. “కరోనా” వ్యాదికి రీయింబర్సుమెంట్ సౌకర్యం కల్పించుట.


★ 4. సంవత్సరమునకు ఒకసారి ఉద్యోగులు చేయించుకొనే మాస్టర్ హెల్త్ చెక్ అప్ ఖర్చును ప్రభుత్వం మాత్రమే భరించాలని కోరియున్నారు.


★ 5. ప్రతి జిల్లలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ తో మూడు నెలలు కు ఒకసారి జరిగే సమావేశానికి బదులుగా రెండు నెలలకు ఒకసారి విధిగా జరపాలని నిర్ణయం.


★ 6. ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో (APVVP) పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అతి త్వరలో లాంచ్ చేస్తారు.


★ 7. ఇప్పుడు ఉన్న హెల్త్ కార్డ్స్ బదులుగా డిజిటల్ కార్డ్స్ ఇవ్వాలని తీర్మానము.


★ 8. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై పట్టణాలలో వైద్యం చేయించుకున్న వారికి రీయింబర్సుమెంట్ సౌకర్యం కల్పించాలని, అలాగే హెల్త్ కార్డ్స్ ద్వారా కుడా వైద్యం అందిచేటట్టు చూడాలని కోరియున్నారు.


★ 9. ప్రైవేటు నెట్ వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యం అన్నింటితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డ్స్ పై వైద్యం అందించని వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి గుర్తింపు రద్దు చేయాలనీ తీర్మానము.


★ 10. ఆర్తో మేడిక్ కేసులు మరియు ఆక్సిడెంట్ కేసులు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నప్పటికీ రీయింబర్సుమెంట్ సౌకర్యం ఇచ్చుటకు చర్యలు తీసుకోగలమని తీర్మానం.


✥ మెడికల్ రీయింబర్సుమెంట్ జీ.ఓ సంవత్సరమునకు పొడిగిస్తూ అతి త్వరలో విడుదల అవుతుందని ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ డాక్టర్. మల్లికార్జున్ రావు గారు, ఐ.ఏ.ఎస్ తెలిపి యున్నారు.


3 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page